BSNL యొక్క Wi-Fi హాట్ స్పాట్ ఓచర్ రూ.16 తో ప్రారంభం

BSNL యొక్క Wi-Fi హాట్ స్పాట్ ఓచర్ రూ.16 తో ప్రారంభం
HIGHLIGHTS

ఇప్పటివరకు దేశంలో 16,000 హాట్ స్పాట్ ఏరియాలను సిద్ధం చేసింది.

ముందుగా, 2018 లో MWC వద్ద టెలికాం మంత్రి, మనోజ్ సిన్హా,  దేశంలో 2019 చివరినాటికి దాదాపు 1 మిలియన్ Wi-Fi హాట్ స్పాట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక చూసినట్లయితే, టెలికాం కంపెనీలు ఈ దిశగా పనిచేయడం మొదలుపెడుతున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా,  బిఎస్ఎన్ఎల్ సంస్థ తరపున, వై-ఫై హాట్ స్పాట్ దేశంలోని వివిధ ప్రాంతాలలో సిద్ధం చేస్తున్నట్లు  తెల్సుతుంది. బిఎస్ఎన్ఎల్ ఇక్కడ తన ఎత్తుగడను మరియు ప్రణాళికను వేగవంతం చేస్తోంది, వోడాఫోన్ మరియు ఎయిర్టెల్ వంటి ప్రైవేటు కంపెనీలు ఈ విషయంలో చాలా ఆలస్యం చేస్తున్నారు. అయితే, త్వరలోనే ఇవి కూడా పూర్తి చెయ్యవచు.

BSNL Wi-Fi టారిఫ్ ఓచర్

Telecom Talk ప్రకారం,  BSNL యూజర్లు ఈ Wi-Fi ని ఉపయోగించడానికి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉంటుందని తెలియజేసింది. అప్పుడు మాత్రమే వారు తమ ఫోన్ల ద్వారా ఈ వైఫై ఇంటర్నెట్ను ఉపయోగించగలరు. ఇటీవలే బిఎస్ఎన్ఎల్ దీనికి సంబంధించి తన నాలుగు ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్లు రూ. 100 ధరలోపలలే  లభిస్తాయి.

ఈ మొదటి ప్రణాళిక, ఇది కేవలం రెండు రోజుల చల్లుబాటుతో వస్తుంది మరియు 2GB డేటా ప్రామాణికతతో  వస్తుంది. దీనిని రూ.19 ధరతో ప్రకటించింది.  ఇక రెండవ ప్లాన్ విషయానికి వస్తే, రెండవ ప్రణాళిక 7GB డేటాతో ఒక వరం అంటే 7 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు దీన్ని రూ 39 ధరతో పొందవచ్చు.

ఇక మిగిలిన రెండు ప్లాన్ల విషయానికి వస్తే,  15GB డేటా మరియు 15 రోజులు చెల్లుబాటు అయ్యే ప్లాన్, రూ .59 ధరతో అందించింది. చివరి ప్లాన్ గురించి చర్చించినట్లయితే, ఇది రూ. 69 ధరతో ఇది వస్తుంది మరియు మీరు ఈ ప్లానుతో 30GB డేటా మరియు 28 రోజులు చెల్లుబాటుతో అందుకోవచ్చు. BSNL దేశంలో దాదాపుగా 30,419 Wi-Fi హాట్ స్పాట్లను మోహరించనుంది, ఇప్పటివరకు 16,367 సైట్లను స్థాపించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo