BSNL vs ఎయిర్టెల్ vs వోడాఫోన్ ఐడియా vs జియో : బెస్ట్ 28 డేస్ ప్లాన్.

HIGHLIGHTS

ఈ ప్లాన్ల ధరలు ఎలా ఉన్నాయో చూడండి. .

BSNL vs ఎయిర్టెల్ vs వోడాఫోన్ ఐడియా vs జియో : బెస్ట్ 28 డేస్ ప్లాన్.

ఈరోజు నుండి అన్ని ప్రధాన టెలికం సంస్థలు వాటి టారిఫ్ లను పెంచనున్నట్లు ప్రకటించిన విషయం మనందరికీ తెలుసు. అయితే, ఈ ప్లాన్ల ధరలు ఎలావుండనున్నాయి, వాటిలో ఏది బెస్ట్ ప్లాన్ కావచ్చు లేదా ఏ టెలికం సంస్థ మనకు మంచి ప్రయోజనాలను అందించనున్నది, అని అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈరోజు తమ వెబ్సైట్లతో టెలికం సంస్థలు ప్రకటించిన ధరలను అన్నింటిని ఊడపోత పోసి చూస్తే, ఆశ్చర్యకరంగా ప్రభుత్వ రంగ టెలికం ఆపరేటర్ అయినటువంటి BSNL అగ్రస్థానంలో నిలుస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే, సరాసరిన ఎక్కువ మంది రీఛార్జ్ చేసే ప్లాన్లను గమనిస్తే కేవలం ఒక నెల (28 రోజులు) ప్రీపెయిడ్ ప్లాన్ను ఎక్కువగా వినియోగదారులు ఎంచుకుంటున్నారు. అందుకోసమే, ఈ ఒక నెల (28 రోజులు) ప్రీపెయిడ్ ప్లాన్లలో ఎంచి ప్లానుగా ఈ టెలికం సంస్థ యొక్క ప్లాన్ నిలుస్తోంది అన్న విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

JIO Rs. 222 : ఒక నెల (28 రోజులు) ప్లాన్

జియో యొక్క ఈ Rs. 222 అల్ ఇన్ ప్లాన్ చాలా ఎక్కువ ధరలో వస్తుంది మరియు ఇదే విభాగంలో మరొక 149 రూపాయల ప్లాన్ ఉండగా, అది కేవలం 24 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇక ఈ 222 ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు రోజు 2GB ల హై స్పీడ్ డేటా అందుతుంది మరియు జియో నుండి జియో కి అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా ఇతర నెట్వరులకు కాలింగ్ కోసం 1,000 నిముషాల FUP పరిమితి గల కాలింగ్ ను అఫర్ చేస్తోంది. అలాగే, డైలీ 100 sms మరియు జియో యాప్స్ కి యాక్సెస్ అందుతుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

వోడాఫోన్ & ఐడియా  Rs.249 : ఒక నెల (28 రోజులు) ప్లాన్     

వోడాఫోన్ ఐడియా యొక్క ఈ Rs. 249 ప్లాన్ కూడా చాలా ఎక్కువ ధరలో వస్తుంది మరియు ఇదే విభాగంలో మరొక 149 రూపాయల ప్లాన్ ఉండగా, అది పూర్తి చెల్లుబాటు కాలానికి కేవలం 2GB  డేటాతో వస్తుంది. ఇక ఈ 249 ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు రోజు 1.5GB ల హై స్పీడ్ డేటా అందుతుంది మరియు వోడాఫోన్ & ఐడియా నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా ఇతర నెట్వరులకు కాలింగ్ కోసం 1,000 నిముషాల FUP పరిమితి గల కాలింగ్ ను అఫర్ చేస్తోంది. అలాగే, డైలీ 100 sms మరియు  28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

భారతీ ఎయిర్టెల్ Rs.248 : ఒక నెల (28 రోజులు) ప్లాన్

భారతీ ఎయిర్టెల్ యొక్క ఈ Rs. 248 ప్లాన్ కూడా చాలా ఎక్కువ ధరలో వస్తుంది మరియు ఇదే విభాగంలో మరొక 148 రూపాయల ప్లాన్ ఉండగా, అది పూర్తి చెల్లుబాటు కాలానికి కేవలం 2GB  డేటాతో వస్తుంది. ఇక ఈ 248 ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు రోజు 1.5GB ల హై స్పీడ్ డేటా అందుతుంది మరియు ఎయిర్టెల్ నుండి ఎయిర్టెల్  నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా ఇతర నెట్వరులకు కాలింగ్ కోసం 1,000 నిముషాల FUP పరిమితి గల కాలింగ్ ను అఫర్ చేస్తోంది. అలాగే, డైలీ 100 sms మరియు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ APP ప్రీమియం కి యాక్సెస్ అందుతుంది. ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

 BSNL Rs.153 : ఒక నెల (28 రోజులు) ప్లాన్  

ఇక BSNL యొక్క ఈ Rs. 153 ప్లాన్ విషయానికి వస్తే, ఇది చాలా తక్కువ ధరలో వస్తుంది మరియు పూర్తి చెల్లుబాటు కాలానికి గాను మరే ఇతర నెట్వర్కుకైనా సరే   అన్లిమిటెడ్ చేసుకునేలా వస్తుంది. ఇక ఈ ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లానుతో మీకు రోజు 1.5GB ల హై స్పీడ్ డేటా అందుతుంది మరియు అన్ని నెట్వర్కులకు  అన్లిమిటెడ్ కాలింగ్ మీకు అందుతుంది మరియు ఎటువంటి FUP పరిమితి లేకుండా అన్లిమిటెడ్ కాలింగ్ అఫర్ చేస్తోంది. అలాగే, డైలీ 100 sms మరియు  28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo