BSNL Super Plan which offers unlimited benefits at lowest price
BSNL Super Plan: ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) బడ్జెట్ యూజర్ల కోసం బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్స్ లో కొన్ని కేవలం రూ. 250 రూపాయల కంటే తక్కువ ఖర్చులో నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు ఆఫర్ చేస్తాయి. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ యూజర్ జేబుకు చిల్లు పెట్టకుండానే కాలింగ్, డేటా మరియు SMS వంటి అన్ని లాభాలు అందిస్తాయి. బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అందించిన అటువంటి బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను ఈరోజు చూద్దాం.
బిఎస్ఎన్ఎల్ రూ, 250 రూపాయల తక్కువ రేటులో మూడు బెస్ట్ ప్రీపెయిడ్ అన్లిమిటెడ్ ప్లాన్స్ ను యూజర్ల కోసం అందించింది. అవేమిటంటే, రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్, రూ. 225 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రూ. 228 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్. ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా కూడా రూ. 225 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ది బెస్ట్ గా నిలుస్తుంది. ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజులు చెల్లుబాటు అయ్యే అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనాలు అందిస్తుంది. డైలీ హై స్పీడ్ డేటా తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను పవర్ ప్లాన్ గా పరిచయం చేసింది. ఎందుకంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం మరియు డైలీ 2.5GB హై స్పీడ్ వంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ప్లాన్ డైలీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ గా డేటా ఉపయోగించుకోవచ్చు.
Also Read: OnePlus Nord CE 6 Lite: బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది.!
ఇది కూడా 30 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజులపాటు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ ఎస్ఎంఎస్ వినియోగ బెనిఫిట్స్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా మరియు ఈ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.