OnePlus Nord CE 6 Lite: బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది.!

HIGHLIGHTS

వన్ ప్లస్ ఈరోజు మార్కెట్లో తన మిడ్ రేంజ్ మరియు బడ్జెట్ ఫోన్ లను విడుదల చేసింది

నార్డ్ CE సిరీస్ నుంచి CE 6 మరియు CE 6 లైట్ రెండు ఫోన్లు రిలీజ్ చేసింది

OnePlus Nord CE 6 Lite స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో రిలీజ్ చేసింది

OnePlus Nord CE 6 Lite: బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది.!

OnePlus Nord CE 6 Lite: వన్ ప్లస్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో తన మిడ్ రేంజ్ మరియు బడ్జెట్ ఫోన్ లను విడుదల చేసింది. నార్డ్ CE సిరీస్ నుంచి CE 6 మరియు CE 6 లైట్ రెండు ఫోన్లు రిలీజ్ చేసింది. వీటిలో వన్ ప్లస్ నార్డ్ CE 6 లైట్ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 10 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే చిప్ సెట్ మరియు భారీ 7000 mAh భారీ బ్యాటరీ వంటి జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord CE 6 Lite: ప్రైస్

వన్ ప్లస్ నార్డ్ సిఈ 6 లైట్ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో అందించింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ చూద్దాం.

  • వన్ ప్లస్ నార్డ్ సిఈ 6 లైట్ (6GB + 128GB) ప్రైస్: రూ. 20,999
  • వన్ ప్లస్ నార్డ్ సిఈ 6 లైట్ (8GB + 128GB) ప్రైస్: రూ. 22,999
  • వన్ ప్లస్ నార్డ్ సిఈ 6 లైట్ (8GB + 256GB) ప్రైస్: రూ. 25,999

ఈ ఫోన్ మే 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ ప్లస్ అఫీషియల్ సైట్ నుంచి లభిస్తుంది.

OnePlus Nord CE 6 Lite price and offers

ఆఫర్లు

ఈ స్మార్ట్ ఫోన్ తో మంచి లాంచ్ ఆఫర్లు కూడా వన్ ప్లస్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ మూడు వేరియంట్స్ పై రూ. 2,000 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ని అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ కేవలం రూ. 18,999 ధరకే లభిస్తుంది.

Also Read: OnePlus Nord CE 6: స్టన్నింగ్ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ అయ్యింది.!

OnePlus Nord CE 6 Lite: ఫీచర్స్

వన్ ప్లస్ ఈ ఫోన్ ను 6.72 LCD స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గరిష్టంగా 144Hz వరకు రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు ఐ కంఫర్ట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 10 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ Dimensity 7400 Apex చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు గరిష్టంగా 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ 50MP (Omnivision OV50D40) మెయిన్ కెమెరా జతగా 2MP డెప్త్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30 FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, వన్ ప్లస్ కెమెరా ఫిల్టర్లు మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ 7000 mAh భారీ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W SUPERVOOC ఛార్జ్ సపోర్ట్ తో పాటు 10W రివర్స్ ఛార్జ్ మరియు బైపాస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో OReality సపోర్ట్ కలిగినా డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile