OnePlus Nord CE 6: స్టన్నింగ్ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

వన్ ప్లస్ ఈరోజు నార్డ్ CE 6 సిరీస్ ఫోన్లు విడుదల చేసింది

OnePlus Nord CE 6 ఫోన్ ను స్టన్నింగ్ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేసింది

ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని కెమెరా వరకు మంచి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది

OnePlus Nord CE 6: స్టన్నింగ్ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ అయ్యింది.!

OnePlus Nord CE 6: వన్ ప్లస్ ఈరోజు నార్డ్ CE 6 సిరీస్ ఫోన్లు విడుదల చేసింది. వీటిలో నార్డ్ CE 6 స్మార్ట్ ఫోన్ ను స్టన్నింగ్ ఫీచర్స్ తో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేసింది. వన్ ప్లస్ ఈ కొత్త ఫోన్ ను 144 FPS గేమింగ్ సపోర్ట్ కలిగిన ప్రోసెసర్, డిస్ప్లే మరియు ప్రత్యేకమైన డిస్ప్లే చిప్ ఫీచర్స్ తో అందించింది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని కెమెరా వరకు మంచి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord CE 6: ప్రైస్

వన్ ప్లస్ ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.

  • వన్ ప్లస్ నార్డ్ CE 6 (8GB + 128GB) ప్రైస్ : రూ. 29,999
  • వన్ ప్లస్ నార్డ్ CE 6 (8GB + 256GB) ప్రైస్ : రూ. 32,999
OnePlus Nord CE 6 price

వన్ ప్లస్ నార్డ్ CE 6 స్మార్ట్ ఫోన్ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ అందించింది.

Also Read: SASA LELE Deal: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ ను బెస్ట్ ప్రైస్ లో అందుకోండి.!

OnePlus Nord CE 6: ఫీచర్స్

వన్ ప్లస్ నార్డ్ CE 6 స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 3840Hz PWM డిమ్మింగ్ మరియు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో అందించింది. ఇది గేమింగ్ మరియు వీడియోలకు చాలా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆక్సిజన్ OS 16 జతగా ఆండ్రాయిడ్ OS 16 పై నడుస్తుంది.

ఈ వన్ ప్లస్ కొత్త ఫోన్ 50MP (OIS సపోర్ట్) మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ భారీ 8000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 80W ఫాస్ట్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా వన్ ప్లస్ ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile