BSNL Super Plan offers 28 days unlimited benefits at rs 51 rupees only
BSNL Super Plan: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ లో బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్న ఏకైక కంపెనీ గా నిలుస్తుంది. ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ చాలా తక్కువ రేటుకే అనేక ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. వీటిలో చాలా ప్లాన్స్ తక్కువ బడ్జెట్ యూజర్ ని అమితంగా ఆకట్టుకుంటాయి. అయితే, ఇటీవల అందించిన ఒక సూపర్ ప్లాన్ తో కేవలం రూ. 51 రీఛార్జ్ ప్లాన్ తో నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు.
దేశవ్యాప్తంగా కొత్త యూజర్ లను ఆకర్షించేందుకు బిఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ కార్డు మరియు ఒక్క రూపాయి రీఛార్జ్ ప్లాన్ ని అమలు చేసింది. అయితే, గత కొన్ని నెలలుగా ఈ ఒక్క రూపాయి రీఛార్జ్ ప్లాన్ ని పక్కన పెట్టింది. కానీ, అదే స్థానంలో రూ. 51 రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకొచ్చింది.
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 51 రీఛార్జ్ ప్లాన్ తో ఉచిత SIM Card తో పాటు 28 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ఆఫర్ కేవలం బిఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్ల కోసం మాత్రమే అందించింది. అంటే, బిఎస్ఎన్ఎల్ కొత్త నెంబర్ తో రూ. 51 రూపాయల రీఛార్జ్ చేసే వారికి ఈ ఆఫర్ లభిస్తుంది.
Also Read : Samsung Galaxy F70 Pro 5G భారీ ఫీచర్స్ మరియు లాంచ్ స్పెషల్ ఆఫర్ తో లాంచ్ అయ్యింది.!
ఇక ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 51 ప్లాన్ తో రీఛార్జ్ చేసే వారికి లభించే బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో 28 రోజుల అన్లిమిటెడ్ లాభాలు లభిస్తాయి. ఇందులో, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా మరియు డైలీ 100 SMS వంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇదే కాదు డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.
ఈ ఆఫర్ ఈ నెల మాత్రమే అందుబాటులో ఉండే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ గా బిఎస్ఎన్ఎల్ అందించింది. ఈ ఆఫర్ ఆగస్టు 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. కాబట్టి, బిఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కి మారాలనుకునే వారికి ఇది గొప్ప సువర్ణావకాశం అవుతుంది. మొదటి నెలలోనే చవక ధరలో అధిక లాభాలు అందించే ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసి నెల మొత్తం అందించవచ్చు. అంతేకాదు, బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న చవక రేటు రీఛార్జ్ ప్లాన్స్ ను కూడా ఆనందించవచ్చు.