Samsung Galaxy F70 Pro 5G భారీ ఫీచర్స్ మరియు స్పెషల్ ఆఫర్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Samsung Galaxy F70 Pro 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ ను భారీ ఫీచర్స్ మరియు లాంచ్ స్పెషల్ ఆఫర్ తో శాంసంగ్ లాంచ్ చేసింది

LPDDR5X 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ఆప్షన్ తో వస్తుంది

Samsung Galaxy F70 Pro 5G భారీ ఫీచర్స్ మరియు స్పెషల్ ఆఫర్ తో లాంచ్ అయ్యింది.!

Samsung Galaxy F70 Pro 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను భారీ ఫీచర్స్ మరియు లాంచ్ స్పెషల్ ఆఫర్ తో శాంసంగ్ లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ సరికొత్త స్లీక్ డిజైన్ మరియు మరియు కొత్త కలర్స్ లో కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది. మరి ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు కంప్లీట్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy F70 Pro 5G: ప్రైస్

శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో విడుదల చేసింది. ఈ మూడు వేరియంట్ లాంచ్ స్పెషల్ ఆఫర్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో (6GB + 128GB) ప్రైస్ : రూ. 23,999
  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో (8GB + 128GB) ప్రైస్ : రూ. 27,999
  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70 ప్రో (8GB + 256GB) ప్రైస్ : రూ. 32,999

ఈ స్మార్ట్ ఫోన్ ఆరా గ్రీన్ మరియు ఆల్ఫా బ్లాక్ రెండు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు శాంసంగ్ అఫీషియల్ సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అంటే, ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Samsung Galaxy F70 Pro 5G

ఆఫర్స్

ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై బెస్ట్ బ్యాంక్ డీల్స్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ ను Flipkart Axis మరియు Flipkart SBI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 1,200 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.

Also Read : Flipkart Freedom Sale బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ రివీల్ చేసిన ఫ్లిప్ కార్ట్ .. లేటెస్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు అందుకోండి.!

Samsung Galaxy F70 Pro 5G: ఫీచర్స్

ఈ కొత్త ఫోన్ లో 6.7 అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్, సన్నని బెజెల్స్‌ మరియు గొప్ప బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ను క్వాల్కమ్ Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ తో అందించింది. అలాగే, ఇందులో LPDDR5X 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ఆప్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్ మరియు గేమింగ్‌న వంటి పనులు సాఫీగా నిర్వహించగలదు. ఈ ఫోన్ Android 16 ఆధారిత One UI 8.5 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ దీర్ఘకాలిక సాఫ్ట్‌ వేర్ అప్డేట్ మరియు సెక్యూరిటీ అప్‌ డేట్‌ లను కూడా అందుకుంటుంది.

ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా (OIS), 5MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మాక్రో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే, ముందు 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్‌ సపోర్ట్, లేటెస్ట్ AI ఆధారిత కెమెరా ఫీచర్లు మరియు ప్రత్యేకమైన శాంసంగ్ కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ మరియు ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6,000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంది. అంతేకాదు, ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ కూడా శాంసంగ్ Knox Security సెక్యూరిటీ ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile