BSNL Super Offer: కేవలం రూ. 1 రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
దేశ ప్రజల కోసం బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించింది
కేవలం ఒక్క రూపాయితో రీఛార్జ్ చేస్తే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంచింది
BSNL Super Offer: ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) దేశ ప్రజల కోసం అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించింది. అదేమిటంటే, కేవలం ఒక్క రూపాయితో రీఛార్జ్ చేస్తే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంచింది. నెలకు కనీసం 300 రూపాయలైనా మొబైల్ రీఛార్జ్ కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండగా బిఎస్ఎన్ఎల్ మాత్రం కేవలం ఒక్క రూపాయికి అన్లిమిటెడ్ లాభాలు అందించే ఆఫర్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
SurveyBSNL Super Offer: ఏమిటి ఈ ఆఫర్?
2005 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఆజాదిక మహోత్సవ్ ఫ్రీడమ్ ప్లాన్ రూ. 1 ప్రీపెయిడ్ ప్లాన్ ను మధ్యలో నిలిపి వేసింది. ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను మరోసారి ఈ నెలలో ప్రకటించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటుంది.

ప్రజల కోరిక మేరకు ఈ సూపర్ ఆఫర్ ను తిరిగి తీసుకొచ్చినట్లు బిఎస్ఎన్ఎల్ తెలిపింది. అంతేకాదు, ఈ ఆఫర్ ఈ నెల 30వ తేదీ వరకు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ని పొందాలంటే బిఎస్ఎన్ఎల్ యొక్క కొత్త సిమ్ కార్డు తీసుకుని ఈ రూ. 1 ప్లాన్ తో మొదటి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అంటే, ఈ ఆఫర్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే లభిస్తుందని మీరు గమనించాలి. అయినా కూడా కేవలం ఒక్క రూపాయికి 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే ప్లాన్ మరే ఇతర టెలికాం కంపెనీ కూడా ఆఫర్ చేయడం లేదు.
Also Read: ఐకూ యానివర్సరీ సేల్ నుంచి iQOO 15R పై బిగ్ డీల్ అనౌన్స్ చేసిన ఐకూ.!
రూ. 1 రూపాయి ప్లాన్ అందించే బెనిఫిట్స్?
ఇక బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 1 రూపాయి ప్లాన్ అందించే బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను నేషనల్ వైడ్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఇదే కాదు ఈ ప్లాన్ తో 30 రోజులు డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా మరియు ఈ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది. అలాగే, డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా ఈ ప్లాన్ తో అందిస్తుంది.
అంటే, పైన తెలిపిన 30 రోజుల అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు కేవలం రూ. 1 రూపాయికే లభిస్తాయి. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా రూ. 1 రూపాయి రీఛార్జ్ పొందాలనుకునే వెంటనే బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ సెంటర్ ని దర్శించండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile