ఐకూ యానివర్సరీ సేల్ నుంచి iQOO 15R పై బిగ్ డీల్ అనౌన్స్ చేసిన ఐకూ.!

HIGHLIGHTS

ఐకూ యానివర్సరీ సేల్ నుంచి iQOO 15R పై బిగ్ డీల్ అనౌన్స్ చేసింది

ఐకూ విడుదల చేసిన ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఐకూ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది

ఐకూ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సేల్ ను ప్రకటించింది

ఐకూ యానివర్సరీ సేల్ నుంచి iQOO 15R పై బిగ్ డీల్ అనౌన్స్ చేసిన ఐకూ.!

ఐకూ యానివర్సరీ సేల్ నుంచి iQOO 15R పై బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. రీసెంట్ గా ఐకూ విడుదల చేసిన ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ ఐకూ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఐకూ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సేల్ ను ప్రకటించింది మరియు ఈ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO 15R : సేల్ ఆఫర్

ఐకూ 6వ వార్షికోత్సవం సేల్ ను అమెజాన్ ఇండియా నుంచి అనౌన్స్ చేసింది మరియు ఈ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది. ఈ సేల్ నుంచి ఐకూ స్మార్ట్ ఫోన్ పై HDFC, ICICI మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫ్లాట్ రూ. 4,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 40,998 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తుంది. ఈ సేల్ ను అమెజాన్ ఇండియా ద్వారా అందించింది మరియు ఈ ఫోన్ కూడా అమెజాన్ ద్వారా లభిస్తుంది. iQOO 15R

iQOO 15R : ఫీచర్స్

ఈ ఐకూ 15 ఆర్ స్మార్ట్ ఫోన్ 6.59 ఇంచ్ AMOLED స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12GB LPDDR5X ర్యామ్ జతగా 512GB స్టోరేజ్ తో వస్తుంద. ఈ ఫోన్ Q2 సూపర్ కంప్యూటింగ్ చిప్ ను కూడా కలిగి ఉంటుంది.

iQOO 15R Deal from iqoo anniversary sale

కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో 50MP (Sony LYT-700V) మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరాని అందించింది. సూపర్ నైట్ మోడ్, 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ Ai కెమెరా ఫీచర్స్ తో కూడా వస్తుంది.

Also Read: OnePlus Nord 6: మిడ్ రేంజ్ బీస్ట్ గా విడుదలైన వన్ ప్లస్ కొత్త ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్.!

బ్యాటరీ పరంగా, ఈ ఐకూ లేటెస్ట్ ఫోన్ 7600mAh బిగ్ బ్యాటరీతో వచ్చింది. అంతేకాదు, 100W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో అడ్వాన్స్డ్ డ్యూయల్ స్పీకర్ మరియు Dolby Atmos సపోర్ట్ కూడా ఉంది. ఇది IP68 అండ్ IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా నిలిచింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo