OnePlus Nord 6: మిడ్ రేంజ్ బీస్ట్ గా విడుదలైన వన్ ప్లస్ కొత్త ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్.!
వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు భారత మార్కెట్లో రిలీజ్ చేసింది
ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ బీస్ట్ గా విడుదల చేసినట్లు చెప్పవచ్చు
భారీ 9000 mAh బ్యాటరీ మరియు ట్రిపుల్ చిప్ సెట్ వంటి భారీ ఫీచర్స్ తో మార్కెట్ లో ప్రవేశపెట్టింది
OnePlus Nord 6: గత కొంతకాలంగా వన్ ప్లస్ భారీగా టీజింగ్ చేసిన వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ బీస్ట్ గా విడుదల చేసినట్లు చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ ను భారీ 9000 mAh బ్యాటరీ మరియు ట్రిపుల్ చిప్ సెట్ వంటి భారీ ఫీచర్స్ తో మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ లేటెస్ట్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకుందామా.
SurveyOnePlus Nord 6: ప్రైస్
వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్ ఫోన్ 8GB మరియు 12GB రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ రెండు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ ఉంది.
- వన్ ప్లస్ నార్డ్ 6 (8 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 38,999
- వన్ ప్లస్ నార్డ్ 6 (12 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 41,999
ఈ ఫోన్ రెండు వేరియంట్స్ తో పాటు ఫ్రెష్ మింట్, క్విక్ సిల్వర్ మరియు పిచ్ బ్లాక్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఏప్రిల్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ మరియు వన్ ప్లస్ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి ఈ ఫోన్ సేల్ అవుతుంది.

ఆఫర్స్ :
ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా భారీ డీల్స్ కూడా ఈ ఫోన్ పై వన్ ప్లస్ అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ ను Axis మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ తీసుకున్న వారికి రూ. 3,000 భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ పై నో కాస్ట్ EMI ఆఫర్ ను కూడా వన్ ప్లస్ అనౌన్స్ చేసింది.
Also Read: Vivo V70 FE 5G: వివో లేటెస్ట్ భారీ 200MP కెమెరా ఫోన్ ఫస్ట్ సేల్ గొప్ప ఆఫర్స్ తో స్టార్ట్ అవుతోంది.!
OnePlus Nord 6: ఫీచర్స్
వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్ ఫోన్ ఈ సెగ్మెంట్ లో సన్ బరస్ట్ HDR సపోర్ట్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఇందులో 6.78 ఇంచ్ సైజు AMOLED స్క్రీన్ 1.5K రిజల్యూషన్ మరియు 165Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్లస్ రక్షణ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ను వన్ ప్లస్ ట్రిపుల్ చిప్ పవర్ తో అందించింది. ఈ ఫోన్ ను నడిపించడానికి క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 చిప్ సెట్, నెట్ వర్క్ బూస్ట్ కోసం G2 Wi-Fi చిప్ మరియు గొప్ప గేమింగ్ కోసం టచ్ రిఫ్లెక్స్ చిప్ లను అందించింది. ఈ ఫోన్ కలిగిన ఫీచర్స్ తో PC లెవెల్ 165 FPS గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ మరింత గొప్పగా ఉంటుంది.
కెమెరా విభాగంలో, వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్ ఫోన్ 50MP (Sony LYTIA-600) మెయిన్ కెమెరా జతగా 8MP (OmniVision) అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ మెయిన్ మరియు సెల్ఫీ కెమెరా కూడా 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటాయి. బ్యాటరీ విభాగంలో ఈ ఫోన్ మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే, వన్ ప్లస్ ఈ ఫోన్ ని భారీ 9000 mAh బిగ్ బ్యాటరీతో అందించింది. అంతేకాదు, ఇందులో 80W SUPER VOOC ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది.
ఈ ఫోన్ MIL-STD-810H మిలటరీ గ్రేడ్ ప్రొటక్షన్ మరియు IP66, IP68, IP69, IP69K రేటింగ్ తో గొప్ప వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫోన్ గా కూడా ఉంటుంది. ఇందులో అధిక వాల్యూమ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ మరియు O రియాలిటీ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile