BSNL Super Offer: రూ. 1 రీఛార్జ్ తో 24 రోజులు డేటా మరియు కాలింగ్ అందుకోండి.!
అత్యంత చవక ధరలో ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్న ఏకైక టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్
కేవలం రూ. 1 రీఛార్జ్ తో 24 రోజులు డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందించే సూపర్ ఆఫర్
సూపర్ ఆఫర్ క్లోజింగ్ డేట్ ని ఇప్పుడు మరింత పొడిగించింది
BSNL Super Offer: టెలికాం ఇండస్ట్రీ మొత్తం మీద అత్యంత చవక ధరలో ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్న ఏకైక టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్, ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందించింది. కేవలం రూ. 1 రీఛార్జ్ తో 24 రోజులు డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందించే సూపర్ ఆఫర్ క్లోజింగ్ డేట్ ని ఇప్పుడు మరింత పొడిగించింది. ఈ ప్లాన్ తో ఇప్పటికే అనేక యూజర్లు లాభపడ్డారు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే వారికి కేవలం ఒక్క రూపాయికే 24 రోజులు అన్లిమిటెడ్ లాభాలు లభిస్తాయి.
BSNL Super Offer: ఏమిటి ఈ ఆఫర్?
3జి నెట్ వర్క్ నుంచి 4జి నెట్ వర్క్ కి తన నెట్ వర్క్ ను అప్డేట్ చేసిన తర్వాత కొత్త యూజర్లను ఆకర్షించేందుకు బిఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ఫ్రీడమ్ ప్లాన్ అందించింది. ఈ ఆఫర్ తో కొత్త సిమ్ కార్డు తీసుకుని ఫస్ట్ రీఛార్జ్ ని కేవలం రూ. 1 చెల్లించి రీఛార్జ్ చేస్తే 30 రోజులు లాభాలు అందించింది.
ఈ ప్లాన్ గత సంవత్సరం అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇదే ప్లాన్ ను బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ 2.0 పేరుతో మళ్ళి తిరిగి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ తో కొత్త సిం కార్డు తీసుకుని రూ. 1 ఆఫర్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 24 రోజులు అన్లిమిటెడ్ లాభాలు ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ఈ నెలలో క్లోజ్ అవుతుండగా, బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ను ఏకంగా 2027 ఫిబ్రవరి 8వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించింది.
BSNL Super Offer: అందిచే లాభాలు ఏమిటి
ఈ బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ 2.0 ఆఫర్ తో కొత్త సిం కార్డ్ తీసుకుని ఒక్క రూపాయి తో రీఛార్జ్ చేసే వారికి 24 రోజులు బెనిఫిట్స్ అందిస్తుంది. అవేమిటంటే, ఈ రీఛార్జ్ తో 24 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే, ఈ 24 రోజుల చెల్లుబాటు కాలానికి డైలీ 1 జీబీ వేగవంతమైన డేటా మరియు ఈ లిమిటెడ్ ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. అంతేకాదు, 24 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS లాభాలు అందిస్తుంది.
ఇప్పుడు పైన మనం చెప్పుకున్న అన్ని 24 రోజుల బెనిఫిట్స్ కూడా కేవలం రూ. 1 రూపాయికే అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ వ్యాలిడిటీ ముగిసిన తర్వాత మీరు రెగ్యులర్ రీఛార్జ్ లను చేయాల్సి ఉంటుంది. మీరు రెగ్యులర్ గా రీఛార్జ్ చేయడానికి కూడా మీకు చాలా చవక ధరలో బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి.