BSNL Super Offer 24 days unlimited benefit rs 1 plan date extended
BSNL Super Offer గా పిలవబడే రూ. 1 రూపాయి అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ని బిఎస్ఎన్ఎల్ తిరిగి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కేవలం ఒక్క రూపాయికే 24 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. యావత్ టెలికాం ఇండస్ట్రీ లో ఇలాంటి ఒక ప్రీపెయిడ్ ప్లాన్ లేదు. ఇంత చవక ధరలో ఒక ప్రీపెయిడ్ ప్లాన్ లేదా ఆఫర్ ని అందిస్తున్న ఏకైక టెలికాం కంపెనీగా కేవలం ప్రభుత్వ టెలికాం ‘భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) మాత్రమే నిలిచింది.
బిఎస్ఎన్ఎల్ 4జి లాంచ్ చేసిన తర్వాత కంపెనీ స్థిరమైన నెట్వర్క్ మరియు వేగవంతమైన డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ నెట్వర్క్ విస్తరణ తర్వాత బిఎస్ఎన్ఎల్ తన యూజర్ బేస్ ని మరింత విస్తరించే దిశగా కొన్ని కొత్త ప్లాన్స్ మరియు ఆఫర్స్ ని తన పోర్ట్ ఫోలియో లో భాగంగా చేసింది. ఇందులో అత్యంత ముఖ్యమైన ఆఫర్, రూ. 1 రూపాయి తో అందించిన బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్ లేదా ప్రీపెయిడ్ ప్లాన్.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లేదా ఆఫర్ తో ముందుగా నెల రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించింది. చాలా నెలలు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను కొనసాగించిన బిఎస్ఎన్ఎల్, మధ్యలో ఈ రూ. 1 ప్లాన్ ఆఫర్ ని నిలిపి వేసింది. అయితే, రీసెంట్ గా బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ 2.0 పేరుతో ఈ ఒక్క రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ ని మరలా తిరిగి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో యూజర్లు కేవలం రూపాయి చెల్లించి ఏకంగా 24 రోజుల అన్లిమిటెడ్ బెనిఫిట్స్ పొందవచ్చు.
అయితే, ఈ ఆఫర్ ని గత నెలలో ప్రకటించిన బిఎస్ఎన్ఎల్, అక్టోబర్ 12 తో ఈ ఆఫర్ ని ముగిస్తున్నట్లు ప్రకటించింది. కానీ, అక్టోబర్ 14 నుంచి ఈ ప్లాన్ ను మరలా తిరిగి తీసుకొచ్చింది. అంటే, ఈ ఆఫర్ క్లోజింగ్ డేట్ ని నవంబర్ 9వ తేదీ వరకు పొడిగించింది. 2026 దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా ఈ ఆఫర్ ని పొడిగించినట్టు తెలుస్తోంది.
Also Read: BSNL Offer: రేపటితో ముగియనున్న సూపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి.!
ఈ ఒక్క రూపాయి రీఛార్జ్ ఆఫర్ కేవలం కొత్త SIM కార్డు తీసుకుని మొదటిసారి రీఛార్జ్ చేసే కొత్త కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒక ఈ ప్లాన్ అందించే బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే కొత్త కస్టమర్లకు 24 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ వ్యాలిడిటీ తో పాటు డైలీ 1 జీబీ హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.
ఇక ఈ ఒక్క రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ తో వ్యాలిడిటీ ముగిసిన తర్వాత మీరు బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న రెగ్యులర్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.