BSNL Silver Jubilee Plan: 25 సంవత్సరాల వేడుక ప్లాన్ అందించిన ప్రభుత్వ టెలికాం.!
ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ 25 సంవత్సరాల వేడుక ప్లాన్ అనౌన్స్ చేసింది
BSNL Silver Jubilee Plan తక్కువ ఖర్చుతో నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్ 225 రుపాయల ఖర్చుతో నెల మొత్తం అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది
BSNL Silver Jubilee Plan: ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ 25 సంవత్సరాల వేడుక ప్లాన్ అనౌన్స్ చేసింది. 25 సంవత్సరాలు గా బిఎస్ఎన్ఎల్ ని ఆదరించిన యూజర్లకు కట్టుబడుతూ చాలా తక్కువ ఖర్చుతో నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ అనౌన్స్ చేసింది. బిఎస్ఎన్ఎల్ యూజర్స్ అందరికీ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. మరి బిఎస్ఎన్ఎల్ కొత్తగా లాంచ్ చేసిన ఈ సిల్వర్ జూబ్లీ ప్లాన్ విశేషాలు ఏమిటో చూద్దామా.
SurveyBSNL Silver Jubilee Plan ఏమిటి?
బిఎస్ఎన్ఎల్ 25 సంవత్సరాల వేడుక సందర్భంగా ఈ కొత్త సిల్వర్ జూబ్లీ ప్లాన్ అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్ ను కేవలం రూ. 225 రూపాయలు చెల్లించి రీఛార్జ్ చేసుకునే అవకాశం అందించింది. ఈ ప్లాన్ కేవలం రూ. 225 రుపాయల ఖర్చుతో నెల మొత్తం అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఇది మాత్రమే కాదు సిల్వర్ జూబ్లీ బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ కూడా బిఎస్ఎన్ఎల్ యూజర్లకు ఆఫర్ చేస్తోంది. ఈ బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ ని కేవలం రూ. 625 రూపాయలకే అందించింది. ఈ రెండు ప్లాన్స్ అందించే ప్రయోజనాలు వివరంగా ఈ క్రింద చూడవచ్చు.
BSNL Silver Jubilee Plan / STV-225
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 225 రూపాయల రీఛార్జ్ తో వస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ 30 రోజుల వ్యాలిడిటీ కోసం అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 2.5GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఏ కంపెనీ 4G ప్రీపెయిడ్ ప్లాన్ తో తో పోల్చి చూసినా కూడా చవక రేటులో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది.

బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు దేశం మొత్తం లక్షకు పైగా ఏరియాలలో మంచి కనెక్టివిటీ తో కూడిన 4G నెట్ వర్క్ ఆఫర్ చేస్తోంది. ఎప్పటి వరకు యూజర్లు చెబుతున్న నెట్ వర్క్ సమస్య కూడా తీరిపోయినట్లే కాబట్టి, ఈ చవక ప్రీపెయిడ్ ప్లాన్ తో యూజర్లు నెల మొత్తం నిశ్చింతగా ఉండొచ్చు.
Also Read: Apple M5 chip తో వచ్చిన 14.2 ఇంచ్ MacBook Pro ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
Broadband / Fibre / AirFibre Plan
బిఎస్ఎన్ఎల్ 25 సంవత్సరాల సెలబ్రేషన్స్ ప్రమోషన్ లో భాగంగా ఈ బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ అందించింది. ఈ బ్రాండ్ ప్లాన్ అక్టోబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే బ్రాండ్ బ్యాండ్ యూజర్లకు 75 Mbps స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. నెల మొత్తం 2500 GB డేటా ఈ ప్లాన్ తో అందిస్తుంది మరియు లిమిట్ ముగిసిన తర్వాత 4Mbps వేగంతో అన్లిమిటెడ్ డేటా కూడా ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ SonyLiv మరియు జియో హాట్ స్టార్ వంటి OTT యాప్స్ మరియు 600 కి పైగా ఛానల్స్ అందించే IFTV సర్వీస్ కూడా అందిస్తుంది. ఇది లిమిటెడ్ పీరియడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ అమౌంట్ కి GST అదనంగా చెల్లించాలి.