BSNL : భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించడంలో బెస్ట్ టెలికాం కంపెనీగా యూజర్ల నీరాజనాలు అందుకుంటోంది. ఇప్పటికే అందించిన చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ తో పాటు కొత్త బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా రెగ్యులర్ గా తన పోర్ట్ ఫోలియోకి జత చేస్తోంది. అయితే, వీటిలో కూడా కొన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు అందించే ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఈరోజు ఒక బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ చుడనున్నాము. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 500 కంటే తక్కువ ఖర్చుతో 72 రోజు అన్లిమిటెడ్ లాభాలు పొందుతారు.
Survey
✅ Thank you for completing the survey!
BSNL : ఏమిటి బెస్ట్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అందించిన రూ. 485 రూపాయల బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో వచ్చే బెస్ట్ దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ గా చెప్పబడుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 72 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
బీఎస్ఎన్ఎల్ యొక్క రూ. 485 బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 72 రోజుల వ్యాలిడిటీ అందుకుంటారు. ఈ 72 రోజుల వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తుంది. ఇది కాకుండా ఈ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS వినియోగ సౌలభ్యం కూడా అందుతుంది. ఈ ప్లాన్ తో అందించే 2 జీబీ హై స్పీడ్ డేట్ లిమిట్ ముగిసిన తర్వాత 40kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.
ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 72 రోజులు నిశ్చింతగా ఉండొచ్చు. ఈ ప్లాన్ మాదిరిగా తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు అందించే మరో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. అదే బీఎస్ఎన్ఎల్ యొక్క రూ. 347 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పైన తెలిపిన రూ. 485 ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలు 50 రోజులు అందిస్తుంది. ఈ రెండు ప్లాన్స్ కూడా అధిక డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా చెప్పబడుతున్నాయి.