BSNL Plan: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) యూజర్లకు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లకు చాలా చవక ధరలో ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఆ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను ఈరోజు క్లుప్తంగా చూడనున్నారు.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా బెస్ట్ BSNL ప్రీపెయిడ్ ప్లాన్?
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 997 రూపాయల లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ తక్కువ ధరలో ఎక్కువ లాభాలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 1000 రూపాయల కంటే తక్కువ ధరలో అన్లిమిటెడ్ డేట్ మరియు కాలింగ్ తో పాటు \మరిన్ని లాభాలు అందిస్తుంది.
ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ 160 రోజులు చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, ఈ చెల్లుబాటు కాలానికి గాను రోజుకు 2GB హై స్పీడ్ డేటా మరియు ఈ లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వద్ద అన్లిమిటెడ్ డేటాని ఆఫర్ చేస్తుంది. అలాగే, 160 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS వినియోగ సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది.
ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు మరికొన్ని ఇతర బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి. అవేమిటంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 24 రోజుల వ్యాలిడిటీతో 24GB ల అదనపు డేటా లభిస్తుంది. అలాగే, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమ్ ఆన్ Astrotell, Gameium, Lystn పాడ్కాస్ట్, జింగ్ మ్యూజిక్ మరియు BSNL ట్యూన్స్ కి యాక్సెస్ లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile