BSNL: ఇక SIM Cards నేరుగా ఇంటికి డెలివరీ చేస్తానంటున్న ప్రభుత్వ టెలికాం.!

HIGHLIGHTS

టెలికాం రంగంలో పెరుగుతున్న కాంపిటీషన్

BSNL కూడా పోటీగా కొత్త సర్వీస్ ను తీసుకు వచ్చింది

ఇంటి వద్దకే BSNL Sim Card తెప్పించుకోండి

BSNL: ఇక SIM Cards నేరుగా ఇంటికి డెలివరీ చేస్తానంటున్న ప్రభుత్వ టెలికాం.!

BSNL: టెలికాం రంగంలో పెరుగుతున్న కాంపిటీషన్ తో అన్ని కంపెనీలు కూడా కొత్త సర్వీస్ లను జత చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన BSNL కూడా పోటీగా కొత్త సర్వీస్ ను తీసుకు వచ్చింది. 5G సర్వీసులు దేశంలో అడుగుపెట్టిన నాటి నుండి తగ్గుతున్న కస్టమర్ లను మళ్ళీ తిరిగి భర్తీ చేసేందుకు, ఇక SIM Cards నేరుగా ఇంటికి డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. కొత్త యూజర్లను త్వరిత గతిన యాడ్ చేసేందుకు ఈ కొత్త సర్వీస్ సహాయపడుతుందని బిఎస్ఎన్ఎల్ యోచిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL: SIM Cards హోమ్ డెలివరీ  

బిఎస్ఎన్ఎల్ ఇక నుంచి దేశంలో సిమ్ కార్డ్ లను నేరుగా ఇంటికే అందించడానికి, కొత్త సర్వీసులు మొదలు పెట్టింది. ఈ బ్రేకింగ్ న్యూస్ ను ముందుగా టెలీకాం టాక్ రిపోర్ట్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం, బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ హోమ్ డెలివరీ సర్వీస్ ల కోసం Prune కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ ఇప్పటికే జియో, వోడాఫోన్ ఐడియా మరియు ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీల సిమ్ కార్డులు హోమ్ డెలివరీ చేస్తోంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో బిఎస్ఎన్ఎల్ కూడా వచ్చి చేరింది.

BSNL SIM Cards
BSNL SIM Cards

వాస్తవానికి, ఇప్పటికే అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా సిమ్ కార్డ్ లను హోమ్ డెలివరీ చేస్తున్నాయి. సిమ్ కార్డ్ ను ఇంటి వద్దే పొందడం అనేది యూజర్లను ఆకర్షించే విషయంగా ఉంటుంది. ఇది బిఎస్ఎన్ఎల్ యూజర్ బేస్ ను పెంచేందుకు సహాయం చేసే అవకాశం ఉండవచ్చు. అయితే, వాస్తవానికి అత్యంత వేగవంతమైన 5G సర్వీస్ కోసం యూజర్లు మొగ్గు చూపడం, 5G లేని ప్రాంతంలో 4G సర్వీస్ లకు తరలి వెళ్లడం బిఎస్ఎన్ఎల్ ను దెబ్బతీశాయి.

Also Read: Aadhaar Update: ఉచిత ఆధార్ అప్డేట్ కి ఇక మిగిలింది వారం రోజులే.. త్వరపడండి.!

అయితే, ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ కూడా మెల్ల మెల్లగా దేశంలోని నలుమూలలా తన 4జి సేవలు విస్తరిస్తోంది. అందుకే, కొత్త సిమ్ కార్డ్ హోమ్ డెలివరీ సర్వీస్ ద్వారా బిఎస్ఎన్ఎల్ యూజర్ బేస్ ను పెంచడానికి సన్నద్ధమవుతోంది. అయితే, కాలింగ్ కంటే ఎక్కువగా హై స్పీడ్ డేటా పై ఎక్కువ మక్కువ చూపుతున్న యూజర్లకు హై స్పీడ్ డేటా కి భరోసా కూడా బిఎస్ఎన్ఎల్ ఇవ్వవలసి ఉంటుంది.

Prune వెబ్సైట్ మరియు యాప్ లో సిమ్ కార్డ్ హోమ్ డెలివరీ లిస్ట్ లో బిఎస్ఎన్ఎల్ ను లిస్ట్ చేసింది. అంటే, బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డ్ ను ప్రూన్ నుండి బుక్ చేసుకుని నేరుగా ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo