BSNL న్యూ ఇయర్ బంపర్ అఫర్ : అధిక వ్యాలిడిటీ మరియు డైలీ 3GB డేటాతో వస్తుంది

BSNL న్యూ ఇయర్ బంపర్ అఫర్ : అధిక వ్యాలిడిటీ మరియు డైలీ 3GB డేటాతో వస్తుంది

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయినటువంటి, BSNL కొత్త సంవత్సర కానుకగా బంపర్ ప్రీపెయిడ్ ప్లాన్ను తన వినియోగదారుల కోసం ప్రకటించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,999 ధరలో వస్తుంది మరియు దీనితో అనేక లాభాలను వినియోగదారులకు అందిస్తుంది. అయితే, ఇది కేవలం ఇక నిర్ణిత కాలవ్యవధిలో మాత్రమే వస్తుంది. అంటే, ఇది లిమిటెడ్ పిరియడ్ అఫర్ అని అర్ధం.

Rs.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ : ప్రయోజనాలు

వాస్తవానికి, ఈ Rs.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పటికే అందుబాటులో వుంది. అయితే, ఈ ప్లాను ముందుగా 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. కానీ, ఈ ప్రస్తుతం BSNL దీని పైన 60 రోజుల వ్యాలిడిటీని  పెంచింది. అంటే, ఈ ప్లాన్ను రీఛార్జ్ చేసేవారికి దీనితో 425 రోజుల వ్యాలిడిటీ అంధిస్తుంది. అంటే, మీకు 14 నెలల వ్యాలిడిటీ ఏఈ ప్లానుతో లభిస్తుంది.

అధనంగా, మీకు రోజుకు 3GB హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. ఇక కాలింగ్ విషయానికి వస్తే, ఈ ప్లానుతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం మీకు లభిస్తుంది. వీటితో పాటుగా, డైలీ 100 SMS లను కూడా అఫర్ చేస్తోంది. ఇక అధనపు ప్రయోజనాల విషయానికి వస్తే, పూర్తి సంవత్సరానికి, అంటే 365 రోజలు మీకు BSNL ట్యూన్స్ మరియు BSNL TV సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.   అయితే, ఈ అఫర్ కేవలం 2019 డిసెంబర్ 25 నుండి 2020 జనవరి 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది.                                          

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo