BSNL రూ. 1 అన్లిమిటెడ్ ప్లాన్ ఆఫర్ మరో 5 రోజుల్లో ముగుస్తుంది.!
BSNL కొత్త అందించిన రూ. 1 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ మరో 5 రోజుల్లో ముగుస్తుంది
బీఎస్ఎన్ఎల్ ఇటీవల తీసుకొచ్చిన రూ. 1 ఆఫర్ ఈ నెల 15 వ తేదీతో ముగుస్తుంది
ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ముగిసేలోపు ఈ ప్లాన్ ను అందుకోండి
BSNL కొత్త అందించిన రూ. 1 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ మరో 5 రోజుల్లో ముగుస్తుంది. కొత్త యూజర్‌లను ఆకర్షించే విధంగా బీఎస్ఎన్ఎల్ ఇటీవల తీసుకొచ్చిన రూ. 1 అన్లిమిటెడ్ ప్లాన్ ఆఫర్ ఈ నెల 15 వ తేదీతో ముగుస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే కేవలం ఒక్క రూపాయికే నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు. టెలికాం ఇండస్ట్రీ మొత్తం మీద ఇలాంటి ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ చేస్తున్న ఏకైక కంపెనీ గా బీఎస్ఎన్ఎల్ నిలుస్తుంది. అందుకే, ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ముగిసేలోపు ఈ ప్లాన్ ను అందుకోండి.
SurveyBSNL రూ. 1 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్
బీఎస్ఎన్ఎల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ను 2025 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ ప్లాన్ గడువు తేదీ పెంచుకుంటూ వస్తోంది. ముందు కేవలం ఆగస్టు నెల కోసం మాత్రమే ఈ ప్లాన్ అందించిన బీఎస్ఎన్ఎల్, ఈ ఆఫర్ గడువు పెంచుకుంటూ వచ్చింది. అయితే, ఈ ఆఫర్ ఇప్పుడు నవంబర్ 15వ తేదీ తో ముగుస్తుందని వెల్లడించింది.

బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ను కేవలం కొత్త యూజర్ల కోసం మాత్రమే అందించింది. అంటే, బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు తో చేసే ఫస్ట్ రీఛార్జ్ పై ఈ ఆఫర్ ని అందిస్తుంది. అంతేకాదు, బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ తీసుకునే యూజర్లకు సిమ్ కార్డ్ కూడా ఉచితంగా అందిస్తుంది. ఈ ఆఫర్ తో రీచార్జ్ చేసే కొత్త యూజర్లు నెల రోజుల పాటు అన్లిమిటెడ్ లాభాలు అందుకుంటారు.
Also Read: Flipkart బిగ్ డిస్కౌంట్ తో 50 ఇంచ్ QLED Smart Tv కేవలం 21 వేలకే లభిస్తోంది.!
BSNL రూ. 1 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
బీఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ తో 30 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు 30 రోజులు రోజుకు 100 SMS వినియోగ వంటి ప్రయోజనాలు అందిస్తుంది. ఈ అన్ని ప్రయోజనాలు కూడా కేవలం ఒక్క రూపాయికే అందుకోవచ్చు.
అంతేకాదు, ఈ ప్లాన్ ముగిసిన తర్వాత కూడా తక్కువ రేటుకే మంచి ప్లాన్ తో ఈ నెంబర్ ను కొనసాగించే అవకాశం ఉంది. ఎందుకంటే, అతి తక్కువ ధరలో బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్లు బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, త్వరలోనే 5G నెట్వర్క్ అందించే దిశగా బీఎస్ఎన్ఎల్ పరుగులు తీస్తోంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile