BSNL Limited Period Offer: రూ. 599 ప్లాన్ తో అదనపు లాభాలు ప్రకటించింది.!
బిఎస్ఎన్ఎల్ యూజర్లకు గొప్ప లాభాలను అందించిన బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్
BSNL Limited Period Offer అదనపు డేటా లాభాలతో అందుబాటులో ఉంది
బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్
BSNL Limited Period Offer: బిఎస్ఎన్ఎల్ యూజర్లకు గొప్ప లాభాలను అందించిన బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు లిమిటెడ్ టైం కోసం అదనపు డేటా లాభాలతో అందుబాటులో ఉంది. బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 3GB హాయ్ స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలు 84 రోజుల పాటు అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ పైన అందించిన లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ మరియు పూర్తి ప్రయోజనాలు తెలుసుకోండి.
SurveyBSNL Limited Period Offer
బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అందించిన వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 599 ప్లాన్ ఇప్పుడు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ తో అందుబాటులో వుంది. ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను 1 అక్టోబర్ 2024 నుంచి 24 అక్టోబర్ 2024 మధ్య కాలంలో రీచార్జ్ చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు డేటా, కాలింగ్ మరియు మరిన్ని ప్రయోజనాలు అందిస్తుంది.
బిఎస్ఎన్ఎల్ రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్ (WFH Plan) 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ లాభాన్ని అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 3GB హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. ఈ డైలీ హై స్పీడ్ డేట్ ముగిసిన తర్వాత 40kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా వినియోగానికి కూడా అవకాశం ఇస్తుంది.

ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 100 SMS వినియోగ సౌలభ్యం కూడా అందిస్తుంది. ఇవి కాకుండా, ఈ ప్లాన్ తో అదనపు లాభాలను కూడా బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. అవేమిటంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 24 రోజులు చెల్లుబాటుతో 24 GB అదనపు డేటా ను అందిస్తుంది. పైన తేలిన విధంగా 1 అక్టోబర్ 2024 నుంచి 24 అక్టోబర్ 2024 మధ్య కాలంలో రీచార్జ్ చేసే వారికి మాత్రమే ఇది లభిస్తుంది.
Also Read: చవక ధరలో టాప్ లోడ్ Washing Machine డీల్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్.!
ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ రీచార్జ్ తో Zing Music, BSNL ట్యూన్స్, GameOn మరియు Astrotell, Hardy Games, Challenger Arena Games, Gameium ప్లస్ మరియు Lystn Podcast యాక్సెస్ ను కూడా ఉచితంగా ఆఫర్ చేస్తోంది.
మరిన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు రీచార్జ్ చెయ్యడానికి Click Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile