BSNL అఫర్: రూ.200 కంటే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు అందుకోండి.!

HIGHLIGHTS

BSNL తక్కువ ధరలో గొప్ప ప్రయోజనాలను అందిస్తున్న టెలికం కంపెనీగా నిలుస్తుంది

ఈరోజు BSNL అఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూడనున్నాము

ధిక ప్రయోజనాలను అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ గురించి మాట్లాడనున్నాము

BSNL అఫర్: రూ.200 కంటే తక్కువ ఖర్చుతో అధిక లాభాలు అందుకోండి.!

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ చాలా తక్కువ ధరలో గొప్ప ప్రయోజనాలను అందిస్తున్న టెలికం కంపెనీగా నిలుస్తుంది. అందుకే, ఈరోజు BSNL అఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూడనున్నాము. అందులోనూ కేవలం రూ.200 రూపాయల కంటే తక్కువ ధరలో అధిక ప్రయోజనాలను అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ గురించి మాట్లాడనున్నాము. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL రూ.107 ప్లాన్:

BSNL యొక్క రూ. 107 ప్రీపెయిడ్ ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 3GB హై స్పీడ్ డేటా మరియు  200 నిముషాల ఉచిత కాలింగ్ మినిట్స్ కూడా అందుతాయి. ఈ ఉచిత కాలింగ్ మినిట్స్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, 35 వాలిడిటీ కాలానికి BSNL Tunes ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. 

BSNL రూ.153 ప్లాన్:

BSNL యొక్క రూ. 153 ప్రీపెయిడ్ ప్లాన్ 26 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో డైలీ 1GB హై స్పీడ్ డేటా మరియు  అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం కూడా అందుతుంది. ఈ ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ ను అన్ని నెటవర్క్ లకు కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, డైలీ 100SMS ప్రయోజనం కూడా ఈ 26 రోజుల వాలిడిటీ కాలానికి అందుకుంటారు.

BSNL రూ.197 ప్లాన్:

BSNL యొక్క రూ.197 ప్రీపెయిడ్ ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం కూడా అందుతుంది. అలాగే, డైలీ 100SMS మరియు Zing ప్రయోజనం కూడా అందుతుంది. ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న డేటా, కాలింగ్ మరియు SMS ఉచిత ప్రయోజనాలు కేవలం 15 రోజులకు మాత్రమే అందుతాయి. వ్యాలిడిటీ మాత్రం 70 రోజులు అని గుర్తుంచుకోండి. 

BSNL రూ.199 ప్లాన్:

BSNL యొక్క రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం కూడా అందుతుంది. అలాగే, డైలీ 100SMS ప్రయోజనం కూడా అందుతుంది. ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న డేటా, కాలింగ్ మరియు SMS ఉచిత ప్రయోజనాలు పూర్తిగా నెల రోజులకు వర్తిస్తుంది. 

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo