BSNL Free SIM మరియు 30 రోజుల అన్లిమిటెడ్ బెనిఫిట్స్ కేవలం రూ. 1 కే అందుకోండి.!

HIGHLIGHTS

30 రోజుల అన్లిమిటెడ్ బెనిఫిట్స్ కేవలం రూ. 1 కే అందుకోండి

బిఎస్ఎన్ఎల్ వినియోగదారులను ఆకట్టుకునే సూపర్ ఆఫర్‌ ను మరోసారి తీసుకొచ్చింది

బిఎస్ఎన్ఎల్ SIM కార్డు కూడా ఉచితంగా లభిస్తుంది

BSNL Free SIM మరియు 30 రోజుల అన్లిమిటెడ్ బెనిఫిట్స్ కేవలం రూ. 1 కే అందుకోండి. ఎందుకంటే, ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులను ఆకట్టుకునే సూపర్ ఆఫర్‌ ను మరోసారి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ తో కేవలం రూ.1 రీచార్జ్‌ తో కొత్త బిఎస్ఎన్ఎల్ SIM కార్డ్‌ తో పాటు 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతి రోజు 2GB హై స్పీడ్ డేటా మరియు SMS ప్రయోజనాలు అందిస్తుంది. గత సంవత్సరం తెచ్చిన “BSNL Freedom Plan” ను ఇప్పుడు ఈ నెలలో మరోసారి తీసుకొచ్చింది.

BSNL Free SIM మరియు 30 రోజులు బెనిఫిట్స్ అందుకోండి

ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం సంస్థలు టారిఫ్ ధరలు పెంచుతున్న సమయంలో బిఎస్ఎన్ఎల్ మాత్రం ఈ అతి చవక ఆఫర్‌ తో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా, రెండో SIM కార్డ్ మైంటైన్ చేయాలనీ చూస్తున్న వారు లేదా BSNL 4G నెట్‌ వర్క్‌ ను ట్రై చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం అని నిపుణులు చెబుతున్నారు.

ఆఫర్‌లో ఏమేం లభిస్తాయి?

ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా కొత్త వినియోగదారులు లేదా పోర్ట్ చేసుకునే కస్టమర్లు కేవలం రూ.1 చెల్లించి 30 రోజులు అన్‌లిమిటెడ్ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 30 రోజుల వ్యాలిడిటీ అందుకుంటారు. ఈ కాలానికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB హైస్పీడ్ డేటా మరియు రోజుకు 100 SMS వంటి కంప్లీట్ బెనిఫిట్స్ అందుకుంటారు. అంతేకాదు, బిఎస్ఎన్ఎల్ SIM కార్డు కూడా ఉచితంగా లభిస్తుంది.

అయితే, ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ మే 31వ తేదీ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ గడువు తేదీ ముగిసే లోపుగా ఈ ఆఫర్ తో రీఛార్జ్ చేసుకునే వారికి మాత్రమే ఇది లభిస్తుంది.

ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది?

ఈ ప్లాన్ ప్రధానంగా బిఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లకు లభిస్తుంది. అలాగే, ఇతర నెట్‌వర్క్‌ల నుంచి బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయ్యే వారికి లభిస్తుంది.

Also Read: Vu Dolby Atmos సౌండ్ బార్ QLED స్మార్ట్ టీవీ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!

ఈ ఆఫర్‌ ను ఎలా పొందాలి?

ఈ ఆఫర్‌ను పొందడానికి సమీపంలోని బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్ లేదా రిటైలర్‌ను సందర్శించాలి. అక్కడ ఆధార్ లేదా చెల్లుబాటు అయ్యే ID Proof ఇవ్వాలి. రూ.1తో SIM యాక్టివేషన్ చేయించుకోవాలి. అంతే, మీ కొత్త సిమ్ మరియు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ మీకు అందుతాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :