BSNL Christmas Bonanza: యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపిన ప్రభుత్వ టెలికాం.!
బీఎస్ఎన్ఎల్ క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ బొనాంజా ఆఫర్ అనౌన్స్ చేసింది
ఒక్క రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే వన్ మంత్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్
కొత్త యూజర్ల కోసం కొత్త సంవత్సరంలో కూడా అందుబాటులో ఉంటుంది
BSNL Christmas Bonanza: ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్, 2025 క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ బొనాంజా ఆఫర్ అనౌన్స్ చేసింది. అదేమిటంటే, ఒక్క రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే వన్ మంత్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ముగింపు గడువు తేదీ మరో వారం రోజులు పొడిగించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే బెనిఫిట్స్ మరియు ఈ ప్లాన్ కొత్త ముగింపు తేదీ ఏమిటో వివరంగా తెలుసుకోండి.
SurveyBSNL Christmas Bonanza: ఆఫర్
కేవలం ఒక్క రూపాయితో నెల రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ను 2025 ఆగస్టు నెలలో బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన రూ. 1 లిమిటెడ్ పీరియడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ను మళ్ళీ డిసెంబర్ లో కూడా అందించింది. ఈ ప్లాన్ ను డిసెంబర్ నెల మొత్తం అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ ను 2026 జనవరి 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
అంటే, ఒక్క రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు కొత్త యూజర్ల కోసం కొత్త సంవత్సరంలో కూడా అందుబాటులో ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ ఇక్కడ చూడవచ్చు.
Also Read: boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ భారీ డీల్స్ తో కేవలం 10 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
BSNL Christmas Bonanza: బెనిఫిట్స్
ఇక ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఒక్క రూపాయికే 30 రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజులు వ్యాలిడిటీ తో పాటు 30 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 జీబీ డేటా మరియు డైలీ 100 SMS వంటి బెనిఫిట్స్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో వచ్చే డైలీ 2జీబీ హై స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో నెల రోజులు అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో కేవలం కొత్త సిం కార్డు తీసుకునే యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే, బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డ్ కొత్తగా తీసుకుని చేసే ఫస్ట్ రీఛార్జ్ పై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒకవేళ బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ తో జతగా కావాలని మీరు చూస్తుంటే, ఇది మీకు సరైన సమయం. ఒక్క రూపాయికే బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు మరియు 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.