BSNL: ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 395 రోజులు నిశ్చింతగా ఉండొచ్చు.!

BSNL: ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 395 రోజులు నిశ్చింతగా ఉండొచ్చు.!
HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ యొక్క బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్లాన్ రీఛార్జ్ తో 13 నెలలు నిశ్చితంగా ఉండవచ్చు

కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలు అందుతాయి

నెల నెలా లేదా క్వార్ట్రర్లి రీఛార్జ్ కాకుండా ఒక్కసారే దీర్ఘకాలం కోసం రీఛార్జ్ చేయాలనుకుంటున్నారు? అయితే, బిఎస్ఎన్ఎల్ యొక్క బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి వుంది. BSNLయొక్క ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 395 రోజులు నిశ్చింతగా మీరు ఉండొచ్చు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే, అన్లిమిటెడ్ కాలింగ్, హెవీ డేటా మరియు మరిన్ని లాభాలను ఈ  బిఎస్ఎన్ఎల్ ప్లాన్ మీకు ఆఫర్ చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ల చేస్తున్న ఈ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలను తెలుసుకుందాం. 

BSNL యొక్క రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్ దీర్ఘకాలం అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందించే ప్లాన్ గా చెప్పబడుతుంది. ఈ  బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలను క్రింద చూడవచ్చు. 

BSNL Rs. 2,399

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 2,399 లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా 395 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంటే, ఈ ప్లాన్ రీఛార్జ్ తో 13 నెలలు నిశ్చితంగా ఉండవచ్చు. కేవలం వ్యాలిడిటీ మాత్రమే ఈ ప్లాన్ తో వస్తుంది అనుకోకండి. ఈ ప్లాన్ 395 రోజుల పాటు రోజుకు 2GB హై స్పీడ్ డేటా అందిస్తుంది మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. అంటే, ఈ ప్లాన్ తో 395 రోజుల పాటు మీకు కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలు అందుతాయి. 

ఇది మాత్రమే కాదు, పైన తెలిపిన ప్రయోజనాలతో పాటు ఇతర లాభాలు కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో 30 రోజుల పటు ఉచిత PRBT, ఉచిత Eros ఎంటర్టైన్మెంట్ యాక్సెస్ మరియు 30 రోజుల Lokdhun యాక్సెస్ ను కూడా అందిస్తుంది. 

మరిన్ని BSNL ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం CliCk Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo