తక్కువ ధరలో ఎక్కవ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్..!
తక్కువ ధరలో ఎక్కవ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్
BSNL యూజర్లకు అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్
అతితక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ ప్రయోజాలను అందిస్తుంది
తక్కువ ధరలో ఎక్కవ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ BSNL తన కస్టమర్లకు అందిస్తోంది. రీఛార్జ్ అమౌంట్ తక్కువే అయినా ఈ ప్లాన్స్ అందించే లాభాలు మాత్రమే ఎక్కువనే చెప్పొచ్చు. అందుకే, తక్కువ ధరలో ఎక్కువ లాభాలు అందించే BSNL బెస్ట్ ప్లాన్ లను గురించి ఈరోజు చుడనున్నాము. యూజర్లకు అధిక లాభాలను అందించే ఆ బెస్ట్ ప్లాన్స్ ఏమిటి మరియు వాటి ఆయా ప్లాన్స్ అఫర్ చేస్తున్న ప్రయోజాలు ఏమిటో తెలుసుకుందాం పదండి.
SurveyBSNL యొక్క రూ.249 ప్లాన్ మరియు BSNL రూ.397 ప్రీపెయిడ్ ప్లాన్స్ కస్టమర్లకు మంచి లాభాలను అందిస్తున్న ప్లాన్స్ గా చెప్పవచ్చు. ఇందులో ఒకటి అన్లిమిటెడ్ ప్రయోజాలతో వస్తుండగా, మరొకటి అతితక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్స్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడవచ్చు.
BSNL రూ.249:
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ యొక్క బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఇది కేవలం వ్యాలిడిటీ మాత్రమే తీసుకువస్తుంది అని మాత్రం అనుకోకండి. ఈ ప్లాన్ తో డైలీ 2GB హాయ్ స్పీడ్ డేటా అందుతుంది మరియు ఎటువంటి రోమింగ్ లేకుండా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా పొందుతారు. అలాగే, రోజుకు 100 ఉచిత SMS లను కూడా మీరు ఈ ప్లాన్ తో పొందవచ్చు. డైలీ డేటా ముగిసిన తరువాత స్పీడ్ 40Kbps కి తగ్గించబడుతుంది.
BSNL రూ.397:
పైన తెలిపి అఫర్ తో పాటుగా మరోక బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా BSNL తన కస్టమర్ల కోసం అఫర్ చేస్తోంది. అదే రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ అఫర్ తో BSNL కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే పూర్తి 180 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేస్తుంది.
ఈ అఫర్ ముందు నుండే అందుబాటులో వుంది మరియు BSNL బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 180 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.
అయితే, ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS మరియు డేటా కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి.
BSNL యొక్క మరిన్ని బెస్ట్ అఫర్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile