BSNL వార్షిక ప్లాన్ పైన 201 డిస్కౌంట్ : ఇప్పుడు కేవలం రూ.1111 రూపాయలు మాత్రమే

HIGHLIGHTS

డిస్కౌంట్ కేవలం జూలై 31 వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుంది.

BSNL వార్షిక ప్లాన్ పైన 201 డిస్కౌంట్ : ఇప్పుడు కేవలం రూ.1111 రూపాయలు మాత్రమే

ప్రభుత్వ టెలికామ్ సంస్థ అయినటువంటి, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వార్షిక అన్లిమిటెడ్ కాలింగ్ ప్రీపెయిడ్ ప్లాన్ అయినటువంటి Rs.1312 ప్లాన్ పైన గొప్ప మార్పులు చేసింది. ఈ ప్లాన్ను ఇప్పుడు కేవలం Rs.1,111 ధరకే అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లానుతో, సంవత్సరమంతా అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. అధనంగా, పూర్తి వ్యాలిడిటీ కాలానికి గానూ 12GB హై స్పీడ్ డేటా మరియు 1000SMS లను కూడా అందిస్తోంది. అయితే, కేవలం కాలింగ్ కోసం ఒక మంచి ప్లాన్ కోసం ఎదురు చూసేవారికి, ఇది నిజంగా ఒక గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ అని చెప్పొచ్చు. అయితే, ఈ డిస్కౌంట్ కేవలం జూలై 31 వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తుంది.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇంకా, దీనితో పాటుగా డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను అందించే మరొక  Rs 1699 ప్రీపెయిడ్ వార్షిక ప్రణాళిక కూడా ఉంది. అదే Rs. 1699 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ . జియో యొక్క ప్రీపెయిడ్ అఫర్ Rs. 1699 ప్లానుకు పోటీగా తీసుకొచ్చిన ఈ BSNL  Rs.1699 ప్లాన్ తో, లోకల్ మరియు STD అపరిమిత కాలింగ్, రోజువారీ 100SMS లు మరియు రోజువారీ 2GB డాటాతో మొత్తంగా 730GB డేటాని 365 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. ఈ ప్లాన్ యొక్క FUP పరిమితిని దాటిన తరువాత దీని స్పీడ్ 80Kbps కి తగ్గించబడుతుంది. 

 మరొక Rs. 2099 ప్రీపెయిడ్ ప్రణాళికతో,  లోకల్ మరియు STD అపరిమిత కాలింగ్, డైలీ 100SMS పరిమితి మరియు రోజువారీ 4GB డాటాతో మొత్తంగా 1460GB డేటాని 365 రోజుల చెల్లుబాటుతో అందిస్తోంది. దీని యొక్క FUP పరిమితి దాటిన తరువాత దీని స్పీడ్ 80Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ప్రస్తుతం BSNL ప్రకటించిన 2.2GB అధిక ఉచిత డేటా అఫర్ వలన, ఈప్లానుతో రోజుకు 4.2 GB డేటా లభిస్తుంది.   

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo