BSNL vs ఎయిర్టెల్ vs జియో vs Vi: టెలికం సంస్థలు అఫర్ చేసే బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్

BSNL vs ఎయిర్టెల్ vs జియో vs Vi: టెలికం సంస్థలు అఫర్ చేసే బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్
HIGHLIGHTS

టెలికం కంపెనీలు వారి కస్టమర్లకు మంచి ప్లాన్స్ అందివ్వడానికి ప్రయత్నిస్తున్నాయి

తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందించే ప్లాన్స్

డేటా, కాలింగ్ మరియు మరిన్ని అందించిన బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్

టెలికం కంపెనీలు అన్ని కూడా వారివారి కస్టమర్లకు మంచి ప్లాన్స్ అందివ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే, వాటిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందించే ప్లాన్స్ కోసం కస్టమర్లు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా, 28 రోజుల వ్యాలిడిటీతో తక్కువ ధరలో డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఉచిత SMS సర్వీస్ లను అఫర్ చేసే ప్లాన్స్ ను అమితంగా కోరుకుంటారు. అందుకే, టెలికం సంస్థలు తక్కువ ధరలో డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ప్రయోజనాలతో అందించిన బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చూద్దాం.

BSNL జియో యొక్క చౌకైన 28/30 రోజుల ప్లాన్

BSNL యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్ 153 రూపాయలకు వస్తుంది. ఈ రూ. 209 ప్లాన్ తో కస్టమర్లు 28 రోజుల పాటు డైలీ 1GB చొప్పున మొత్తం 28GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS  లను అందిస్తుంది. అంతేకాదు, 28 రోజుల ఉచిత PRBT(పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్) తో కూడా వస్తుంది. BNSL యొక్క రెండవ ప్లాన్ 199 రూపాయలకు వస్తుంది. ఇది రోజుకు 2 GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.  

ఎయిర్టెల్ యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్స్

ఎయిర్టెల్ యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్ రూ.179 రూపాయలకు వస్తుంది. వినియోగదారులకు ఇది 28 రోజుల కాలానికి గాను మొత్తం 2 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అన్ని నెట్‌వర్క్‌లకు 300 SMSలను అందిస్తుంది. అలాగే, ప్రైమ్ వీడియోలో ఉచిత ట్రయల్, ఉచిత హాలోట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్‌ కి ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఇక మరొక బెస్ట్ ప్లాన్ 265 రూపాయలకు వస్తుంది. ఇది డైలీ 1 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే, ప్రైమ్ వీడియో ఉచిత ట్రయల్, ఉచిత హాలోట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్‌ కి ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.

రిలయన్స్ జియో యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్

రిలయన్స్ జియో యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్ 209 రూపాయలకు వస్తుంది. వాస్తవానికి, రూ.155 రూపాయల ప్లాన్ ఉన్నాకూడా, అది కేవలం జియోఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. రూ.209 ప్లాన్ ప్రకారం, కస్టమర్లు 28 రోజుల పాటు డైలీ 1GB చొప్పున మొత్తం 28GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS  లను అందిస్తుంది. అంతేకాదు, జియో యాప్‌ లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది. జియో యొక్క రెండవ ప్లాన్ 239 రూపాయలకు వస్తుంది. ఇది రోజుకు 1.5 GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే, జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా యొక్క చౌకైన 28 రోజుల ప్లాన్స్

Vodafone Idea చౌకైన 28 రోజుల ప్లాన్‌ను రూ.179 రూపాయలకు వస్తుంది. ఈ ప్లాన్ తో కస్టమర్లు 28 రోజులకు గాను మొత్తం 2 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 300 SMSలతో సహా  Vi సినిమాలు మరియు టీవీలకు ఉచిత యాక్సెస్ ఇవ్వబడుతుంది. Vi యొక్క రెండవ ప్లాన్ 269 రూపాయలకు వస్తుంది. ఇది రోజుకు 1 GB డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే, Vi Movies & TV Basic కి యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo