జియో, BSNL, ఎయిర్టెల్ మరియు Vi అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్ (అండర్ రూ.100).!

HIGHLIGHTS

జియో, BSNL, ఎయిర్టెల్ మరియు Vi అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్

టెలికం కంపెనీలు తగిన ప్రయోజాలతో కొన్ని బడ్జెట్ ప్లాన్స్ అఫర్ చేస్తున్నాయి

కస్టమర్ల అవసరాలకు తగిన విధంగా ఈ ప్లాన్స్ ను టెలికం కంపెనీలు అందుబాటులో ఉంచాయి

జియో, BSNL, ఎయిర్టెల్ మరియు Vi అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్ (అండర్ రూ.100).!

జియో, BSNL, ఎయిర్టెల్ మరియు Vi అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్స్ (అండర్ రూ.100) గురించి ఈరోజు చూడనున్నాము. తమ కస్టమర్లకు  చవక ధరలో టెలికం కంపెనీలు తగిన ప్రయోజాలతో కొన్ని బడ్జెట్ ప్లాన్స్ అఫర్ చేస్తున్నాయి. ఇందులో, జియో, ఎయిర్టెల్, BSNL మరియు వోడాఫోన్ ఐడియా (Vi) టెలికం కూడా ఉన్నాయి. తక్కువ ధరలో కస్టమర్ల అవసరాలకు తగిన విధంగా ఈ ప్లాన్స్ ను టెలికం కంపెనీలు అందుబాటులో ఉంచాయి. మరి జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) లు వారి కస్టమర్ల కోసం అఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్ (అండర్ రూ.100) ఏమిటో చూసేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio యొక్క అత్యంత చవకైన ప్లాన్

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అత్యంత చవకైన ప్లాన్ ను కేవలం రూ.25 రూపాయలకే అందిస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే కస్టమర్లు 2GB డేటాని యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీతో పొందుతారు. ఇది కాకుండా జియో యొక్క రూ. 61 రీఛార్జ్ ప్లాన్‌ను కూడా వుంది మరియు ఇది కూడా మీరు రీఛార్జ్ చేసిన యాక్టివ్ ప్లాన్ చెల్లుబాటుతో 6GB డేటాను అందిస్తుంది.

BSNL యొక్క అత్యంత చవకైన ప్లాన్

BSNL యొక్క చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లలో మొదటిది 49 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్. ఈ ప్లాన్ 20 రోజుల వ్యాలిడిటీతో 100 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఈ ప్లాన్‌ను సెకండరీ SIM కార్డ్‌ కోసం ఉపయోగించవచ్చు, ఇది మీ ఖర్చులను తగ్గిస్తుంది మరియు మీరు రెండు SIM లను ఉపయోగించవచ్చు.

ఎయిర్టెల్ యొక్క అత్యంత చవకైన ప్లాన్

ఎయిర్టెల్ యొక్క అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, రూ.99. ప్లాన్ గురించి చెప్పొచ్చు. ఈ ప్లాన్ తో కస్టమర్‌లు 28 రోజుల వ్యాలిడిటీని  రూ. 99 టాక్ టైమ్‌ను పొందుతారు. ఈ మొత్తాన్ని యూజర్లు కాల్ చేయడానికి లేదా  మెసేజెస్ కోసం కూడా ఉపయోగించవచ్చు. అదనంగా, ఈ ప్లాన్‌ తో కస్టమర్లు 200 MB డేటాను కూడా పొందుతారు.

వోడాఫోన్ ఐడియా (Vi) యొక్క అత్యంత చవకైన ప్లాన్

వోడాఫోన్ ఐడియా (Vi) తన వినియోగదారులకు 98 రూపాయల ధరలో చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అలాగే, 99 రూపాయల లిమిటెడ్  వ్యాలిడిటీ టాక్ టైం మరియు 200 MB డేటాను అందిస్తుంది.

మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo