జియో ఫైబర్ కనెక్షన్ గురించి పూర్తిగా తెలుసుకోండి

జియో ఫైబర్ కనెక్షన్ గురించి పూర్తిగా  తెలుసుకోండి
HIGHLIGHTS

జియో త్వరలో బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా EMI పథకాన్ని కూడా ప్రకటించింది.

JioGigaFiber ప్రివ్యూ ఆఫర్ కింద, Jio వినియోగదారులకు రెండు ప్లాన్‌లను ఇచ్చింది – ఒకటి రూ .4,500 మరియు ఒకటి రూ .2,500. రూ .4,500 ప్రివ్యూ ప్లాన్ 5 Ghz నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే డ్యూయల్-బ్యాండ్ రౌటర్‌తో వస్తుంది, రూ .2,500 ప్లాన్ రౌటర్‌ మాత్రం కేవలం 2.5 Ghz బ్యాండ్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ కారణంగా, వాటి స్పీడ్ లో చాలా వ్యత్యాసం ఉంటుంది. 2,500 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్న తరువాత జియో ఈ 2.5GHz రౌటర్‌ను అందిస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది.

అంటే, రిలయన్స్ జియో అందించే బేస్ స్పీడ్ 100Mbps నుండి వినియోగదారులు 1Gbps వరకు వారికీ కావాల్సిన లైన్ ఎంచుకోవచ్చు. JioFiber ప్రారంభించటానికి ముందు, ఈ సంస్థ మీకు 100Mbps వేగంతో కనెక్షన్ ఇవ్వబోతోంది. కానీ, వాస్తవానికి ఇది మీకు 50Mbps వేగాన్ని మాత్రమే ఇస్తోంది, అంటే గ్రౌండ్ రియాలిటీ మరొకటిగా కనిపిస్తోంది

రిలయన్స్ జియోఫైబర్ ప్రణాళికలు

JioFiber ప్రణాళికలు 699 రూపాయలతో ప్రారంభమవుతాయి మరియు 100Mbps వేగంతో అందిస్తాయి. కొత్త వినియోగదారుడు రూ .1500 సెక్యూరిటీ డిపాజిట్ మరియు రూ .1,000 తిరిగి చెల్లించని ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను కలిగి ఉన్న డిపాజిట్ ఛార్జీ కింద రూ .2,500 చెల్లించాల్సి ఉంటుంది. 'Bronze' పేరిట వచ్చిన రూ .699 ప్లాన్‌కు యూజర్ చందా చెల్లిస్తే, ఈ ప్లాన్‌కు అపరిమిత డేటా లభిస్తుంది కాని హై స్పీడ్ 100 జీబీ + 50 జీబీ వరకూ మాత్రమే వస్తిస్తుంది. ఈ డేటా అయిపోయిన తరువాత, వినియోగదారులు 1Mbps వేగంతో ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు. ఇంట్రడక్టరీ బెనిఫిట్ కింద ఆరు నెలల వరకు ఈ అదనపు డేటా అందించబడుతుంది. 1Mbps యొక్క FUP పైన పేర్కొన్న అన్ని JioFiber ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లకు వర్తిస్తుందని గమనించండి.

జియోఫైబర్ తదుపరి ప్లాన్ 'సిల్వర్' పేరుతో 849 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్. ఈ రీఛార్జ్ ఎంపికలో 200 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. హై-స్పీడ్ ఆఫర్ కింద, 200GB ఇంట్రడక్టరీ ఆఫర్ అందించబడుతుంది. 699 రూపాయల ఈ ప్లాన్ మాదిరిగానే 100Mbps స్పీడ్ కూడా ఈ ప్లాన్‌లో సెట్ చేయబడింది.

1,299 రూపాయల ధరతో, గోల్డ్ ప్రీపెయిడ్ ప్లాన్ 500GB నెలవారీ డేటాతో వస్తుంది మరియు దీని వేగం 500GB. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద, ఈ ప్లాన్‌లో కంపెనీ 250 జీబీ డేటాను అందిస్తోంది. ఇక రూ .2,499 ప్లాన్ గురించి మాట్లాడితే, ఈ డైమండ్ జియోఫైబర్ ప్లాన్ 1250GB నెలవారీ డేటాతో వస్తుంది మరియు దీని వేగం 500Mbps. ఈ ప్రణాళిక ప్రకారం, ఇంట్రడక్టరీ ఆఫర్ కింద ఆరు నెలల పాటు అదనంగా 250GB డేటా లభిస్తుంది.

అధిక బ్యాండ్‌విడ్త్ మరియు డేటాను కోరుకునే వినియోగదారులు 1Gbps వేగంతో 2500GB డేటాను అందించే 3,999 రూపాయల ప్లాటినం ప్లాన్‌కు చందా పొందవచ్చు. ఇది కాకుండా, మీరు టైటానియం జియోఫైబర్ ప్లాన్ గురించి మాట్లాడితే, రూ .8,499 యొక్క ప్లాన్ 1 జిబిపిఎస్ వేగంతో 5000 జిబి డేటాను అందిస్తుంది.

పైన పేర్కొన్న JioFiber ప్రీపెయిడ్ ప్రణాళికలు ఉచిత వాయిస్ బెనిఫిట్ మరియు టీవీ వీడియో కాలింగ్ యొక్క ప్రయోజనాన్ని పొందుతాయి. JioFiber ఇంటర్నెట్ సేవలో జీరో లేటెన్సీ గేమింగ్ మరియు కంటెంట్ షేరింగ్ వంటి హోమ్ నెట్‌వర్కింగ్ సేవ కూడా ఉన్నాయి. అదనంగా, ఈ సేవలో 5 పరికరాలకు పరిమితం చేయబడిన నార్టన్ డివైజ్ సెక్యూరిటీ కూడా ఉంది. JioFiber ప్లాటినం మరియు టైటానియం ప్లాన్‌లలో, వినియోగదారులు VR కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు అలాగే మొదటి రోజు ఫస్ట్ షో సినిమాలు మరియు ప్రత్యేక స్పోర్ట్స్ కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.

జియోఫైబర్ స్వాగత ఆఫర్ వివరాలు

జియో కొన్ని హోమ్ గేట్‌వే పరికరాలను కూడా అందిస్తోంది మరియు జియో 4 కె సెట్ టాప్ బాక్స్ అన్ని జియో ఫైబర్ ప్లాన్‌లతో ఉచితం. బ్రోన్జ్ జియోఫైబర్ సభ్యత్వంలో, వినియోగదారులు మూడు నెలలు జియోసినిమా మరియు జియోసావన్‌లకు యాక్సెస్ పొందుతారు. వినియోగదారులు సిల్వర్ ప్లాన్ వైపు వెళితే, మూడు నెలల OTT యాప్స్ కి  చందా ఉచితం, అయినప్పటికీ Jio దీని గురించి ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. గోల్డ్, డైమండ్ మరియు ప్లాటినం జియోఫైబర్ ప్రీపెయిడ్ ప్లాన్ చందాదారులకు ఒక సంవత్సరానికి OTT యాప్లను ఉచిత వార్షిక చందా లభిస్తుంది.

జియోఫైబర్ లాంగ్ టర్మ్ ప్లాన్స్

జియోఫైబర్ 3, 6 మరియు 12 నెలల ప్రణాళికలను అందిస్తోంది. జియో త్వరలో బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా EMI పథకాన్ని కూడా ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo