ఎయిర్‌టెల్ షాకింగ్ న్యూస్: రూ.49 ఇకలేదు రూ.79 ప్రీపెయిడ్ ప్లాన్ తో డబుల్ బెనిఫిట్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 29 Jul 2021
HIGHLIGHTS
  • ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన కొత్త నిర్ణయం

  • రూ.49 ప్లాన్ ను పూర్తిగా నిలిపివేసింది

  • రూ.79 ప్రీపెయిడ్ ప్లాన్ తో డబుల్ బెనిఫిట్స్

ఎయిర్‌టెల్ షాకింగ్ న్యూస్: రూ.49 ఇకలేదు రూ.79 ప్రీపెయిడ్ ప్లాన్ తో డబుల్ బెనిఫిట్
ఎయిర్‌టెల్ షాకింగ్ న్యూస్: రూ.49 ఇకలేదు రూ.79 ప్రీపెయిడ్ ప్లాన్ తో డబుల్ బెనిఫిట్

ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన కొత్త నిర్ణయం తీసుకుంది. ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ గా కొనసాగుతున్న రూ.49 ప్లాన్ ను పూర్తిగా నిలిపివేయడమే కాకుండా రూ.79 ప్రీపెయిడ్ ప్లాన్ లో కూడా మార్పులు చేసింది. అయితే, ఈ రూ.79 ప్రీపెయిడ్ ప్లాన్ లో మార్పు ఎయిర్‌టెల్ కస్టమర్లకు ప్రయోజనాన్నే ఇస్తుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ ఇప్పుడు ఎక్కువ అవుట్ గోయింగ్ మినిట్స్ మరియు డబుల్ డేటాని ఈ ప్లాన్ లో చేర్చింది.

 రూ.79 ప్రీపెయిడ్ ప్లాన్

ఇప్పటి వరకూ 49 రూపాయల నుండి ప్రారంభమయ్యే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్, నేటినుండి 79 రూపాయల ప్లాన్ నుండి ప్రారంభమవుతాయి. ఈ రూ.79 ప్రీపెయిడ్ ప్లాన్ 64 రూపాయల టాక్ టైం తో వస్తుంది మరియు 200 MB డేటా కూడా ప్లాన్ తో లభిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ తో రీచార్జ్ చేస్తే లోకల్ లేదా నేషనల్ కాల్ రేట్ సెకనుకు 1 పైసా వర్తిస్తుంది.

ట్రిపుల్ బెనిఫిట్స్ అందించే ఎయిర్టెల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్  ఈ క్రింద చూడవచ్చు.

1. ఎయిర్టెల్ రూ.298 ప్రీపెయిడ్ ప్లాన్

ఇక ఈ రూ.298 ప్రీపెయిడ్ ప్లాన్ అన్నిప్రయోజనాలతో వస్తుంది. ఈ ప్లానుతో మీకు 28 రోజులకు గాను అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనితో, మీరు ఏ నెట్వర్క్ అయినా కాలింగ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎక్కువ డేటా కూడా లభిస్తుంది మాత్రం ఉండదు. ఈప్లానుతో మీకు రోజుకు 2 GB హై స్పీడ్ డేటా  లభిస్తుంది. ఇది 28 రోజుల పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తంగా 56GBడేటాని అందిస్తుంది. ఇక ఈప్లానుతో డైలీ మీకు 100 SMS లు కూడా వస్తాయి. ఇక , ఈ ప్లాన్ ఇచ్చే ట్రిపుల్ బెనిఫిట్స్ క్రింద చూడండి. 

1. అమేజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ : ఈ ప్లానుతో మీకు 1 నెలఅమేజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా దొరుకుతుంది. 

2. Rs.150 క్యాష్ బ్యాక్ : దీనితో మీకు ఫాస్ట్ టాగ్స్ పైన 150 రూపాయల క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

3. ఎయిర్టెల్ Xtream App యొక్క యాక్సెస్ అందుతుంది. అధనంగా, నెలంతా ఫ్రీ హలో ట్యూన్స్ తో పాటుగా షా అకాడమీలో 4 వారాల ఉచిత కోర్స్ కూడా  పొందవచ్చు.     

1.ఎయిర్టెల్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్

ఇక ఈ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, ఇది కూడా అన్నిప్రయోజనాలతో వస్తుంది. ఈ ప్లానుతో మీకు 28 రోజులకు గాను అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనితో, మీరు ఏ నెట్వర్క్ అయినా కాలింగ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎక్కువ డేటా కూడా లభిస్తుంది. ఈప్లానుతో మీకు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా  లభిస్తుంది. ఇది 28 రోజుల పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తంగా 70GB డేటాని అందిస్తుంది. ఇక ఈప్లానుతో డైలీ మీకు 100 SMS లు కూడా వస్తాయి. ఇక , ఈ ప్లాన్ ఇచ్చే ట్రిపుల్ బెనిఫిట్స్ క్రింద చూడండి.

1. అమేజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ : ఈ ప్లానుతో మీకు 1 నెలఅమేజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా దొరుకుతుంది. 

2. Rs.100 క్యాష్ బ్యాక్ : దీనితో మీకు ఫాస్ట్ టాగ్స్ పైన 150 రూపాయల క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

3. ఎయిర్టెల్ Xtream App యొక్క యాక్సెస్ అందుతుంది. అధనంగా, నెలంతా ఫ్రీ హలో ట్యూన్స్ తో పాటుగా షా అకాడమీలో 4 వారాల ఉచిత కోర్స్ కూడా  పొందవచ్చు. 

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: airtel revised rs 79 plan and offer double benefits
Tags:
airtel airtel rs 49 plan airtel rs 79 airtel revisee
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status