ఎయిర్టెల్ ధమాకా అఫర్: 200 కంటే తక్కువకే 30 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ తెచ్చింది.!

HIGHLIGHTS

ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్

రూ.200 కంటే తక్కువ రేటుకే నెల రోజుల ప్లాన్

అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ప్రయోజనాలను ఈ టెలికం అఫర్ చేస్తుంది

ఎయిర్టెల్ ధమాకా అఫర్: 200 కంటే తక్కువకే 30 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ తెచ్చింది.!

మీరు ఎయిర్టెల్ మొబైల్ నంబర్ ఉపయోగిస్తున్నారా? అయితే, మీకోసమే ఈ గుడ్ న్యూస్. ఎయిర్టెల్ తన యూజర్ల కోసం అతితక్కువ ధరలో నెల మొత్తం చెల్లుబాటు అయ్యే కొత్త అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ తో ఎయిర్టెల్ కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ప్రయోజనాలను ఈ టెలికం అఫర్ చేస్తుంది. ఎయిర్టెల్ సరికొత్తగా తీసుకొచ్చిన ఈ బడ్జెట్ నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజాలను తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఎయిర్టెల్ సరికొత్తగా తీసుకొచ్చిన రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఎయిర్టెల్ కొత్తగా ప్రకటించిన ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వాలిడిటీ కాలానికి గాను ఎటువంటి లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందుతుంది. అయితే, ఈ ప్లాన్ తో మొత్తం 3GB హాయ్ స్పీడ్ డేటా మాత్రమే వస్తుంది. అంటే, 30 రోజులు మొత్తంగా ఈ 3GB డేటా పైనే ఆధారపడాలి.

కాబట్టి, కాలింగ్ కోసం ఎక్కువగా రీఛార్జ్ చేసే వారికీ ఈ ప్లాన్ బాగా సరిపోతుంది. ఇక ఈ ప్లాన్ తో 300 SMS లను కూడా పొందుతారు. అయితే, ఈ 300 SMS ల లిమిట్ ముగిసిన తరువాత ఒక్కొక్క SMS కోసం రూ.1 చెల్లించవలసి ఉంటుంది. అయితే, ఈ ప్లాన్ తో మీరు ఒకే రోజు 100 SMS పంపవచ్చు మరియు అంతకు మించి పైన పంపించే మెసేజిలకి కూడా రూ.1 చెల్లించవలసి ఉంటుంది. ఎయిర్టెల్ యొక్క రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ కాలింగ్ అవసరం కోసం లేదా సెకండరీ సిమ్ ఉపయోగంచలనుకునే వారికి సరైన ఎంపిక కావచ్చు.                                    

మరిన్ని ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo