ICC Men’s T20 World Cup కోసం ఎయిర్టెల్ ప్రత్యేకమైన ప్లాన్స్.. ఒక లుక్కేయండి.!
PL 2024 ముగిసిన వెంటనే పురుషుల టి20 వరల్డ్ కప్ ప్రారంభమయ్యింది
ICC Men's T20 World Cup కోసం ఎయిర్టెల్ ప్రత్యేకమైన ప్లాన్స్ ను అందించింది
ఈ ప్లాన్ లతో పురుషుల టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లను ఎయిర్టెల్ యూజర్లు ఆనందించవచ్చు
ICC Men’s T20 World Cup కోసం ఎయిర్టెల్ ప్రత్యేకమైన ప్లాన్స్ ను అందించింది. IPL 2024 ముగిసిన వెంటనే పురుషుల టి20 వరల్డ్ కప్ ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్ లను చూడటానికి అనువైన డేటా మరియు OTT యాక్సెస్ తో ఎయిర్టెల్ తన యూజర్ల కోసం కొత్త ప్లాన్ లను అందించింది. ఈ ప్లాన్ లను రూ. 499 నుండి మొదలుకొని రూ. 3,359 రూపాయల వరకు ఉండేలా లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ లను సైతం అందించింది.
SurveyICC Men’s T20 World Cup Airtel Plans
పురుషుల టి20 వరల్డ్ కప్ గత నెల చివరి నుండి ప్రారంభమైంది మరియు మ్యాచ్ లు హోరా హోరీగా కొనసాగుతున్నాయి. రసరమ్యమైన ఈ మ్యాచ్ లను తిలకించడానికి ఉర్రూతలూగే వారికోసం ఎయిర్టెల్ ఈ కొత్త ప్లాన్ లను అందించింది. ఈ ప్లాన్స్ మరియు ఈ ప్లాన్ లు అందించే ప్రయోజనాలు వివరంగా చూద్దామా.
ఎయిర్టెల్ రూ. 499 ప్లాన్
ఎయిర్టెల్ రూ. 499 ప్లాన్ ఈ కోవకు చెందుతుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది మరియు 28 రోజులకు గాను అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ తో డిస్నీ+ హాట్ స్టార్ 3 నెలల మొబైల్ యాక్సెస్ యూజర్లకు అంధిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే కస్టమర్లు, డిస్నీ+ హాట్ స్టార్ నుండి పురుషుల టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లను ఆనందించవచ్చు.

అంతేకాదు, ఈ ప్లాన్ తో డైలీ 3GB 4G డేటా మరియు అన్లిమిటెడ్ 5G డేటా సౌలభ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ తో మూడు నెలల అపోలో 24|7, ఉచిత హలో ట్యూన్స్, ఉచిత Wynk మ్యూజిక్ మరియు 20 OTT యాక్సెస్ లతో 28 రోజుల ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే యాక్సెస్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా అందుతాయి.
Also Read: రూ. 1,000 కంటే తక్కువ ధరలో మంచి Smart Watch కావాలా భయ్యా..!
ఎయిర్టెల్ రూ. 869 ప్లాన్
ఎయిర్టెల్ రూ. 869 ప్లాన్ కూడా ఇదే కోవకు చెందుతుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా, డైలీ 100SMS సౌకర్యాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో డిస్నీ+ హాట్ స్టార్ 3 నెలల మొబైల్ యాక్సెస్ యూజర్లకు అంధిస్తుంది.

ఈ ప్లాన్ తో కూడా మూడు నెలల అపోలో 24|7, ఉచిత హలో ట్యూన్స్, ఉచిత Wynk మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా అందుతాయి.
ఇక మరిన్ని ప్లాన్స్ వివరాల్లోకి వెళితే, రూ. 3,359 రూపాయల ప్లాన్ కూడా ఇదే లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో యూజర్లు 365 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2.5GB 4G డేటా లేదా అన్లిమిటెడ్ 5G డేటా మరియు డైలీ 100SMS లాభాలను అందుకుంటారు. అంతేకాదు, రూ. 499 రూపాయల విలువైన వన్ ఇయర్ డిస్నీ+ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను కూడా యూజర్లకు లభిస్తుంది.
ఈ ప్లాన్ కూడా మూడు నెలల అపోలో 24|7, ఉచిత హలో ట్యూన్స్, ఉచిత Wynk మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile