ఎయిర్టెల్ జబర్దస్త్ అఫర్: రూ.199 కే నెలంతా అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
ఎయిర్టెల్ తన యూజర్ల కోసం జబర్దస్త్ అఫర్ తీసుకువచ్చింది
చవక ధరకే 30 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ లాభాలు
సెకండరీ సిమ్ ఉపయోగంచలనుకునే వారికి సరైన ఎంపిక కావచ్చు
ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్టెల్ తన యూజర్ల కోసం జబర్దస్త్ అఫర్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్ తో ఎయిర్టెల్ యూజర్లకు చవక ధరకే 30 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ లాభాలు అందుతాయి. అంటే, కేవలం రూ.199 రూపాయలకే 30 రోజుల అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకువచ్చిందని అర్ధం. ఈ ప్లాన్ తో 30 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ప్రయోజనాలను ఎయిర్టెల్ తన యూజర్లకు అంధిస్తుంది. మరింకెందుకు ఆలశ్యం ఎయిర్టెల్ కొత్త రూ.199 ప్లాన్ వివరాలు తెలుసుకోండి.
Surveyఎయిర్టెల్ సరికొత్తగా తీసుకొచ్చిన రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఎయిర్టెల్ కొత్తగా ప్రకటించిన ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వాలిడిటీ కాలానికి గాను ఎటువంటి లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందుతుంది. అయితే, ఈ ప్లాన్ తో మొత్తం 3GB హాయ్ స్పీడ్ డేటా మాత్రమే వస్తుంది. అంటే, 30 రోజులు మొత్తంగా ఈ 3GB డేటా పైనే ఆధారపడాలి.
కాబట్టి, కాలింగ్ కోసం ఎక్కువగా రీఛార్జ్ చేసే వారికీ ఈ ప్లాన్ బాగా సరిపోతుంది. ఇక ఈ ప్లాన్ తో 300 SMS లను కూడా పొందుతారు. అయితే, ఈ 300 SMS ల లిమిట్ ముగిసిన తరువాత ఒక్కొక్క SMS కోసం రూ.1 చెల్లించవలసి ఉంటుంది. అయితే, ఈ ప్లాన్ తో మీరు ఒకే రోజు 100 SMS పంపవచ్చు మరియు అంతకు మించి పైన పంపించే మెసేజిలకి కూడా రూ.1 చెల్లించవలసి ఉంటుంది. ఎయిర్టెల్ యొక్క రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ కాలింగ్ అవసరం కోసం లేదా సెకండరీ సిమ్ ఉపయోగంచలనుకునే వారికి సరైన ఎంపిక కావచ్చు.
మరిన్ని ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile