జియో కి పోటీగా ఎయిర్‌టెల్ తన ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను ప్రవేశపెట్టింది.

జియో కి పోటీగా ఎయిర్‌టెల్ తన ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను ప్రవేశపెట్టింది.
HIGHLIGHTS

మెజాన్ ప్రైమ్ వీడియో, ZEE5, HOOQ, SunNXT మొదలైన వాటితో సహా ముందే ఇన్‌స్టాల్ చేయబడి వస్తాయి.

త్వరలో మార్కెట్లోకి రానున్నరిలయన్స్ జియో స్మార్ట్ సెట్-టాప్ బాక్స్‌తో పోటీ పడటానికి, ఎయిర్‌టెల్ తన ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఆండ్రాయిడ్ టివి బాక్స్  మరియు వినియోగదారులకు ప్రామాణిక డిటిహెచ్ కనెక్షన్‌తో లైవ్ టివి మరియు OTT యాప్ ల నుండి కంటెంట్‌ను చూడటానికి అనుమతిస్తుంది. ఈ ఎయిర్‌టెల్ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్‌ తోపాటుగా కొన్ని ప్రసిద్ధ OTT యాప్స్ అయినటువంటి,  నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ZEE5, HOOQ, SunNXT మొదలైన వాటితో సహా ముందే ఇన్‌స్టాల్ చేయబడి వస్తాయి.

అధనంగా, ఈ బాక్స్ Chromecast కి మద్దతు ఇస్తుంది మరియు డాల్బీ ఆడియో మద్దతుతో వచ్చే 4K ఎనేబుల్ బాక్స్. అయితే, ఈ ఎయిర్టెల్ ఇంటర్నెట్ టీవీ బాక్స్ అసలు ఏమిటి? ఎందుకంటే ఇది కూడా అదే ఫంక్షన్‌ను అందిస్తుంది … దీని గురించి మాకు ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు కాని త్వరలోనే ఎయిర్‌టెల్ తన ప్రస్తుత ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టివి బాక్స్‌ను సరికొత్త ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌తో పాటు, ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌లో పనిచేసే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ స్టిక్‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ధర 3,999 రూపాయలు మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కు 12 నెలల పాటు సబ్ స్క్రిప్షన్ ఇస్తోంది.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ధర మరియు లభ్యత

ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ లాంచ్ ధర మాదిరిగానే, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను కూడా 3,999 రూపాయలకు ప్రవేశపెట్టారు మరియు బాక్స్ కూడా ఒక సంవత్సరం పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కు ఉచిత సబ్ స్క్రిప్షన్ తో వస్తుంది, ఇది ధర 999 రూపాయల సేవింగ్స్ ఇస్తుందన్నమాట. ఇది కాకుండా, ఒక నెల పాటు HD డిటిహెచ్ యొక్క ఉచిత చందా కూడా చేర్చబడుతుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌లో వినియోగదారులు DTH మరియు OTT యాప్స్ నుండి  కంటెంట్‌ను చూడవచ్చు.

ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ వినియోగదారులందరూ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌కు రూ .2,249 ప్రత్యేక ధర వద్ద అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ బాక్స్‌తో సమానంగా ఉంటుంది, అయితే ఇది ఆండ్రాయిడ్ 9 పైతో వస్తుంది.

అన్ని రిటైల్ దుకాణాలు, ఎయిర్‌టెల్.ఇన్ మరియు పెద్ద ఇ-కామర్స్ సైట్‌లైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు క్రోమా మరియు విజయ్ సేల్స్ వంటి ఎలక్ట్రానిక్ రిటైల్ షాపుల నుండి కూడా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఫీచర్స్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అనేది ఆండ్రాయిడ్ 9 పై పనిచేసే ఆండ్రాయిడ్ టీవీ బాక్స్. ఈ కొత్త ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌లో టీవీ ఛానెళ్ల ఎంపికతో పాటు, ముందే ఇన్‌స్టాల్ చేసిన ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్స్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, ఎయిర్‌టెల్ స్టోర్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌లో వై-ఫై మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు ఇన్ బిల్ట్ Chromecast ఉన్నాయి.

ఇది యూనివర్సల్ రిమోట్‌తో వస్తుంది మరియు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ కోసం గూగుల్ అసిస్టెంట్ వాయిస్ సెర్చ్ ఫీచర్లు మరియు హాట్‌కీలను కలిగి ఉంటుంది. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఎయిర్‌టెల్ స్మార్ట్ రిమోట్ యాప్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ టీవీ బాక్స్‌కు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా లభిస్తోంది, ఇది వినియోగదారులకు వాయిస్ కమాండ్ల సౌలభ్యాన్ని కూడా ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo