ఉచిత బ్యాలెన్స్ మరియు వ్యాలిడిటీని పెంచిన ఎయిర్టెల్ సంస్థ

HIGHLIGHTS

వ్యాలిడిటీ ముగిసిన తర్వాత కూడా ఇన్కమింగ్ కాల్స్ అందుకోవడం వంటివి కొనసాగుతాయి.

ఉచిత బ్యాలెన్స్ మరియు వ్యాలిడిటీని పెంచిన ఎయిర్టెల్ సంస్థ

ప్రస్తుతం, ప్రపంచం మొత్తం కోవిడ్ -19 సంక్షోభంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అందుకే, భారతదేశపు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ టెలికమ్యూనికేషన్ సంస్థ భారతి ఎయిర్‌టెల్, తక్కువ ఆదాయం కలిగిన వినియోగదారులకు సహాయం చేయడానికి, ఈ ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. ఎయిర్టెల్  ప్రీ-పెయిడ్ ప్యాక్‌ ల వ్యాలిడిటీని ఏప్రిల్ 17, 2020 వరకూ 80 మిలియన్లకు(8కోట్లు) పైగా వినియోగదారుల కోసం పొడిగించింది. ఈ కస్టమర్లందరూ వారి ఎయిర్టెల్ మొబైల్ నంబర్లలో వారి ప్లాన్ యొక్క వ్యాలిడిటీ ముగిసిన తర్వాత కూడా ఇన్కమింగ్ కాల్స్ అందుకోవడం వంటివి కొనసాగుతాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ 8 కొట్ల కస్టమర్ల ప్రీ-పెయిడ్ ఖాతాలకు అదనంగా రూ .10 టాక్ టైమ్ ఇవ్వాలని ఎయిర్టెల్ నిర్ణయించింది. తద్వారా వారు కాల్ చేయగలరు లేదా SMS పంపగలరు మరియు తద్వారా వారి బంధువులు మరియు స్నేహితులతో కనెక్ట్ అవ్వవచ్చు. అంతేకాదు, ఈ కార్యక్రమం ప్రారంభమైంది మరియు రాబోయే 48 గంటల్లో ఈ ప్రయోజనాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

ఈ 80 మిలియన్ల(8కోట్ల) కస్టమర్లు ఎయిర్టెల్ నెట్‌వర్క్ యొక్క అన్ని తక్కువ ఆదాయ గృహాలను సమర్థవంతంగా కవర్ చేస్తారు. కోవిడ్ -19 ను ఎదుర్కోవటానికి చేపట్టిన దేశవ్యాప్త లాక్డౌన్ వలన ప్రభావితమైన వలస కార్మికులకు మరియు రోజువారీ వేతనం సంపాదించేవారికి ఈ విషయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అన్ని ఇతర ఎయిర్టెల్ నెట్‌వర్క్ కస్టమర్లు ఇప్పటికే ఆన్‌ లైన్ ప్లాట్‌ ఫామ్‌ ను ఉపయోగించి రీఛార్జ్ చేస్తున్నారు.

ఈ సదుపాయాలతో, ఎయిర్టెల్ కస్టమర్లందరికీ ఇప్పుడు స్థానిక అధికారులు అందించే ముఖ్యమైన సమాచారానికి అనియంత్రిత యాక్సెస్ ఉంటుంది మరియు వారి స్నేహితులతో కనెక్ట్ అయ్యేవీలుంటుంది  భారతదేశం యొక్క డిజిటల్ బ్యాక్ బోన్ సరిగ్గా పనిచేస్తుందని నిర్ధారించడానికి ఎయిర్టెల్ యొక్క నెట్‌వర్క్ బృందాలు 24X7 పనిచేస్తున్నాయి.

భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశ్వత్ శర్మ మాట్లాడుతూ, "కోవిడ్ -19 ముప్పుతో పోరాడే ఈ క్లిష్ట సమయంలో, ప్రతి ఒక్కరూ తమ ప్రియమైనవారితో ఎటువంటి అంతరాయం లేకుండా కనెక్ట్ అయ్యేలా ఎయిర్టెల్ సహాయం చేస్తుంది. ఈ ప్రయోజనం కోసం,  లాక్-డౌన్ కారణంగా దేశంలో వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అందుకే, తక్కువ ఆదాయ రోజువారీ వేతన సంపాదకులను చూసుకోవడం చాలా ముఖ్యం ” అని తెలిపారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo