పేలిన REDMI NOTE 7s స్మార్ట్ ఫోన్ : కస్టమరుదే తప్పంటున్న కంపెనీ

HIGHLIGHTS

అయితే, అసలు ఏమి జరిగిందో చూడండి...

పేలిన REDMI NOTE 7s స్మార్ట్ ఫోన్ : కస్టమరుదే తప్పంటున్న కంపెనీ

మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు లేదా చేయి జారిక్రింద పడినప్పుడో, చాలా అరుదైన పరిస్థితుల్లో కొన్ని సార్లు, కొన్ని మొబైల్ కంపెనీల ఫోన్లు పేలడం గురుంచి మనం ముందుగానే వినివుంటాం. కానీ, ఇప్పుడు కొత్తగా జరిగిన సంఘటన అందుకు పూర్తి విరుద్ధంగా, టేబుల్ పైన ఊరికే అలావుంచినా కూడా పేలినట్లు, ఆ ఫోన్ యొక్క కొనుగోలుదారుడు చెబుతున్నాడు. అయితే, అసలు ఏమి జరిగిందో చూడండి…

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముంబై వాస్తవ్యుడైన, ఈశ్వర్ చౌహన్ అనే వ్యక్త్తి తన బ్లూ కలర్ రెడ్మి నోట్ 7s మొబైల్ ఫోన్ కాలిపోయిందంటూ, తన గోడును వెళ్లబోసుకున్నారు. ఈయన, గత నెలలో ఫ్లిప్కార్ట్ నుండి రెడ్మి నోట్ 7s స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేశారు. ఈ ఫోన్, చేతికి వచ్చిన తరువాత ఎటువంటి ఇబ్బది లేకుండా మంచిగా పని చేసిందని కూడా అయన వివరించారు. అయితే, నవంబర్ 2 వ తేదీన సాయంత్రం 5 గంటలకు తాను తన పనిలో ఉన్నప్పుడు ఇంట్లో నుండి ఏదో కాలిన వాసన వస్తే, లోపలి వెళ్లి ఏమైందని పరిశీలించి చూడగా, ఇంట్లో టేబుల్ పైన ఉంచిన తన ఫోన్ నుండి మంటలు రావడం కనిపించినట్లు తెలిపారు.

ఇక తన ఫోన్ కాలిపోయిన కారణంగా,  ఫోన్ కస్టమర్ కేర్ కి వెళ్లి తన ఫోన్ ఎలా కలిపోయిందన్న విషయాన్ని వివరించి, తన ఫోన్ను సబ్మిట్ చేసాడు. తన ఫోన్   గురించిన సమాచారాన్ని తెలుసుకొని అవాక్కయ్యాడు. ఎందుకంటే, ముందుగా బ్యాటరీలో ఏదో లోపం ఉండి వుంటుంది అందుకే ఫోన్ కాలిపోయి ఉంటుందని చెప్పిన కస్టమర్ కేర్ వాళ్ళు,  ఒక వారం రోజుల తరువత మరొక కొత్త సంగతిని చెప్పారు. అదేమిటంటే, నిషితంగా పరిశీలించిన మీదట ఈ ఫోనులో ఎటువంటి లేదని, కేవలం తన తప్పిదం వల్లనే ఆ ఫోన్ కాలి పోయిందని తెలిపారు.                     

అయితే, ఈ వివరాలను ఫేసుబుక్ లో అందించినట్లుగా చెబుతుండగా, ఈ వ్యక్తి పేరు మీద ఎటువంటి అకౌంట్ లేకపోవడం గమనార్హం.     

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile