షావోమి మి బ్యాండ్ 3 అమేజాన్ ఇండియాలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి సేల్

HIGHLIGHTS

షావోమి తన మి బ్యాండ్ 3 ని ఇండియాలో ప్రారంభించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి రూ . 1,999 ధరతో అమేజాన్ నుండి సేల్ కి ఉండనుంది.

షావోమి మి బ్యాండ్ 3 అమేజాన్ ఇండియాలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి సేల్

బెంగుళూరులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో షావోమి దాని మి బ్యాండ్ 3 ని విడుదల చేసింది. ఈ మి బ్యాండ్ 3 అమేజాన్ ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి సేల్ కి ఉండనుంది. దీని యొక్క NFC -అనేబుల్డ్  వేరియంట్ మనకి ఇంకా అందుబాటులో లేదు. చైనాలో దీని ధర CNY 199 (దాదాపుగా రూ . 2100) ఉండగా, ఇండియాలో మాత్రం దీని ధర రూ . 1,999 గా ఉంటుంది. దీనిని కొనడానికి ఇష్టపడే వారు అమేజాన్ నుండి రూ . 1,999 ధరతో కొనవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

షావోమి మి బ్యాండ్ 3 లక్షణాలు మరియు ప్రత్యేకతలు

షావోమి మి బ్యాండ్ 3, దాదాపుగా షావోమి మి బ్యాండ్ 2 వంటి ఒక నమూనాతో ప్రారంభించబడింది, అయితే ఇప్పుడు సంస్థ దీనికి 2.5D కర్వ్డ్ గ్లాస్ ని జోడించింది. దీనికి అదనంగా మనకు, 0.78-అంగుళాల OLED స్క్రీన్ ని ఇచ్చారు, దీనితో ఈ పరికరం మరింత ఆకర్షణీయంగా ఉంది. షావోమి మి బ్యాండ్ 3 యొక్క ప్రదర్శన తీరు గురించి మాట్లాడితే, ఇది దాదాపుగా 128X80 పిక్సల్స్ కలిగి ఉంటుంది. దీనిని మీరు నలుపు మరియు తెలుపు రంగుల ఎంపికగా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫిట్నెస్ బ్యాండ్లో, షావోమి మి బ్యాండ్ 2 కంటే  కొంత పెద్ద డిస్ప్లే ని ఇచ్చారు. దీనితో పాటు, ఈ  కొత్త బ్యాండ్ ఇప్పుడు మీకు మూడు-రోజుల వాతావరణ సమాచారం ఇస్తుంది, ఈ ఫీచర్ మి బ్యాండ్ 2 లో అందుబాటులో లేదు.

దీనితో పాటు, మీ బ్యాండ్ 3 లో 110mAh సామర్ధ్యం గల బ్యాటరీ ఇవ్వబడింది, ఇది 20-రోజుల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ వాగ్దానం చేస్తుంది. దీనితో పాటు మీరు దానిపై ట్రాకింగ్ లక్షణాన్ని కూడా ఆపివేయవచ్చు. ఇందులో హృదయ స్పందన రేటుతో మరొక లక్షణం ఉంటుంది . ఇది కాకుండా, ఇతర ఫీచర్లలో మీరు నిద్ర పర్యవేక్షణ, స్టెప్ కౌంట్ ట్రాకర్, సైక్లింగ్, స్విమ్మింగ్ మరియు వాకింగ్ మొదలైనవి పొందుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile