Yuva 3 Pro: 9వేల లోపలే 8GB ర్యామ్, 50MP కెమేరాతో వచ్చింది.!

HIGHLIGHTS

లావా ఈరోజు తన కొత్త స్మార్ట్ ఫోన్ Yuva 3 Pro ని విడుదల చేసింది

9 వేల లోపలే 8GB ర్యామ్ మరియు 50MP కెమేరాతో ప్రకటించింది

Yuva 3 Pro మార్కెట్ లో ఉన్న చాలా ఫోన్ లకు గట్టి పోటీగా కనిపిస్తోంది

Yuva 3 Pro: 9వేల లోపలే 8GB ర్యామ్, 50MP కెమేరాతో వచ్చింది.!

ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా ఈరోజు తన కొత్త స్మార్ట్ ఫోన్ Yuva 3 Pro ని విడుదల చేసింది. ఈ ఫోన్ ను కేవలం 9 వేల లోపలే 8GB ర్యామ్ మరియు 50MP కెమేరాతో మరియు మరిన్ని ఇతర ఫీచర్లతో ప్రకటించింది. ఈ ఫోన్ డిజైన్ మరియు ఇతర ఫీచర్ల పరంగా ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న చాలా ఫోన్ లకు గట్టి పోటీగా కనిపిస్తోంది. ఇదంతా తెలుసుకోవాలంటే, ఈ ఫోన్ యొక్క కంప్లీట్ స్పెక్స్, ఫీచర్స్ మరియు ధర వివరాలు తెలుసుకుంటేనే మనకు అర్ధం అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Yuva 3 Pro price

Yuva 3 Pro Price and Specs
యువ 3 ప్రో స్మార్ట్ ఫోన్

యువ 3 ప్రో స్మార్ట్ ఫోన్ ను కంపెనీ 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సింగల్ వేరియంట్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 8,999 రూపాయలుగా లావా ప్రకటించింది. ఈ ఫోన్ ఈరోజు నుండి లావా అధికారిక వెబ్సైట్ నుండి మరియు అధికారిక రిటైల్ స్టోర్స్ నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ డెజర్ట్ గోల్డ్, మేడో పర్పల్ మరియు ఫారెస్ట్ విరిడియన్ అనే మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

Also Read : 200MP మెగా OIS కెమేరాతో వస్తున్న Redmi Note 13 Pro+ 5G స్మార్ట్ ఫోన్.!

లావా యువ 3 ప్రో ప్రత్యేకతలు

లావా యువ 3 ప్రో స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD+ Punch Hole డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ UNISOC T616 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది మరియు Android 13 OS తో వస్తుంది. ఈ ఫోన్ ను మరింత వేగంగా మార్చేందుకు వీలుగా 8GB RAM + 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వలను అందించింది.

లావా యువ 3 ప్రో ప్రత్యేకతలు

లావా యువ 3 ప్రో ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమేరా వుంది. ఇందులో, 50MP మెయిన్ + AI సెకండరీ కెమేరా ఉన్నాయి మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా వుంది. ఈ ఫోన్ కెమేరా 1080p Video రికార్డింగ్ సపోర్ట్ మరియు మంచి కెమేరా ఫిల్టర్స్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 5000mAh బిగ్ బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నాయి.

ఈ ఫోన్ లో అందించిన ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ మరియు బ్యాటరీ సేవింగ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo