ఇలా చేస్తే Philips S7221 5G ఫోన్ చవక ధరలో లభిస్తుంది.!

HIGHLIGHTS

ఫిలిప్స్ ఎట్టకేలకు తన 5జి ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది

బడ్జెట్ ప్రైస్ లో కొనసాగుతున్న చాలా స్మార్ట్ ఫోన్ లకు గట్టిపోటీ గా వచ్చింది

ఇలా చేస్తే సైలెంట్ గా విడుదలైన Philips S7221 5G ఫోన్ చవక ధరలో లభిస్తుంది

ఇలా చేస్తే Philips S7221 5G ఫోన్ చవక ధరలో లభిస్తుంది.!

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ ఫిలిప్స్ ఎట్టకేలకు తన 5జి ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ ను మార్కెట్లో బడ్జెట్ ప్రైస్ లో కొనసాగుతున్న చాలా స్మార్ట్ ఫోన్ లకు గట్టిపోటీ గా అందించింది. అయితే, ఇలా చేస్తే సైలెంట్ గా విడుదలైన Philips S7221 5G ఫోన్ చవక ధరలో లభిస్తుంది. మరి ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ తో పాటు ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ కూడా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Philips S7221 5G: ప్రైస్

ఫిలిప్స్ తన లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 20,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఇది ఈ ఫోన్ బేసిక్ 6GB + 128GB వేరియంట్ కోసం నిర్ణయించిన ధర. అయితే, ఈ ఫోన్ హై ఎండ్ 8GB + 128GB వేరియంట్ ని కూడా కేవలం రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరలో అందించింది. ఈ ఫోన్ రోజు నుంచి అమెజాన్ ఇండియా ద్వారా సేల్ కూడా అవుతోంది.

Philips S7221 5G

ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ప్రైస్ తో పోలిస్తే ఏకంగా రూ. 3,000 రూపాయల తక్కువ ధరలో ఈ ఫోన్ మీరు అందుకోవచ్చు. దీనికోసం మీరు చిన్న ట్రిక్ ఉపయోగించాలి. అదేమిటంటే, ఈ ఫోన్ ను మీరు HSBC Taj క్రెడిట్ కార్డు ఉపయోగించి అమెజాన్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా చందా చేస్తే మీకు ఈ ఫోన్ పై ఏకంగా రూ. 3,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 17,999 ఆఫర్ ధరకే మీకు లభిస్తుంది.

Also Read: Janmashtami 2026: శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మరియు బెస్ట్ ఇమేజ్ ప్రత్యేకం.!

Philips S7221 5G: ఫీచర్స్

ఫిలిప్స్ S7221 స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల HD+ రిజల్యూషన్ కలిగిన IPS LCD స్క్రీన్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ మరియు మంచి బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఫిలిప్స్ ఈ ఫోన్ ను Unisoc T765 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో లాంచ్ చేసింది. ఇది మల్టీ టాస్కింగ్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ మరియు రోజువారీ వినియోగానికి తగిన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. అంతేకాదు, 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో అందించిన 64MP AI మెయిన్ రియర్ కెమెరా ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. ఇది మంచి వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5,700 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్ మరియు IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile