REDMI NOTE 8 PRO సేల్ మరికొద్ది సేపట్లో

HIGHLIGHTS

ఇది 3D కర్వ్డ్ గ్లాస్ తో వస్తుంది.

REDMI NOTE 8 PRO సేల్ మరికొద్ది సేపట్లో

గేమింగ్ మరియు కెమేరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ను, కేవలం రూ.14,999 రుపాయల బడ్జెట్ ధరలో, గేమింగ్ కోసం ప్రత్యేమైన ప్రాసెసర్ అయివంటువంటి మీడియాటెక్ హీలియో G90T SoC శక్తితో, షావోమి సంస్థ  ఇండియాలో లాంచ్ చేసిన REDMI NOTE 8 PRO యొక్క మరొక ఫ్లాష్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి అమేజాన్ ఇండియా మరియు Mi.com నుండి జరగనుంది. ఈ ఫోన్ కేవలం గేమింగ్ కోసం మాత్రమే కాకూండా కెమేరాల పరంగా కూడా చాలా మంచి ప్రత్యేకతలతో వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రెడ్మి నోట్ 8 ప్రో  : ధరలు

1. రెడ్మి నోట్ 8 ప్రో (6GB +64GB ) – Rs.14,999/-

2. రెడ్మి నోట్ 8 ప్రో (6GB +128GB ) – Rs.15,999/-

3. రెడ్మి నోట్ 8 ప్రో (8GB +128GB ) – Rs.17,999/

రెడ్మి నోట్ 8 ప్రో ప్రత్యేకతలు

రెడ్మి నోట్ 8 ప్రో ఒక 6.53-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో ఇది 3D కర్వ్డ్ గ్లాస్ తో వస్తుంది.  ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్‌లో మీరు దాని వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని సరికొత్తగా చూడనున్నారు. అదనంగా, ఇందులో గేమింగ్ కోసం మీడియా టెక్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన మీడియాటెక్ G90T గేమింగ్ చిప్‌సెట్‌ తోఈ స్మార్ట్ శక్తినిస్తుంది.మరొక కొత్త విషయం ఏమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ Alexa Built-ఇన్ తో వస్తుంది మరియు ఇండియాలో ఈ ప్రత్యేకతతో వచ్చిన మెట్టమొదటి స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  64 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు  కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 20MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 ప్రోలో,ఒక 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అలాగే, బాక్సుతో పాటుగా ఒక 18W చార్జరును అందించారు.                         

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo