May10న Xiaomi నుండి స్మార్ట్ ఫోన్, బ్యాండ్ తో పాటు MIUI 8 వస్తున్నాయి
By
Shrey Pacheco |
Updated on 27-Apr-2016
Xiaomi MIUI వెర్షన్ 8, Mi Band 2 అండ్ Mi Max స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది May 10 న. ఈ విషయాన్ని కంపెని అఫీషియల్ ఫోరం లో తెలిపింది.
Survey✅ Thank you for completing the survey!
మీ ఇమేజినేషణ్ కు బియాండ్ గా ఉండే కొత్త డిజైన్స్ మరియు మీరు కోరుకునే ఫీచర్స్ ను కొత్త వెర్షన్ లో ప్రవేశపెడుతున్నాము అని చెబుతుంది కంపెని.
ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ బార్ యొక్క డెమో కూడా చూపించింది. కొత్త డైనమిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది MIUI 8 నోటిఫికేషన్ బార్ అని అంటుంది Xiaomi.
ఇక Mi బ్యాండ్ విషయానికి వస్తే దీనిలో LCD డిస్ప్లే మరియు ఒక ఫిజికల్ బటన్ ఉంటాయి అని తెలిసింది. Mi మాక్స్ ఫోన్ గురించి చెప్పాలంటే ఇది 6.4 in QHD డిస్ప్లే తో వస్తుంది అని రిపోర్ట్స్..
ఇంకా స్నాప్ డ్రాగన్ 820 SoC, capacitive ఫిజికల్ బటన్స్ ఉండనున్నాయి అని కూడా అప్ డేట్. అంటే ఫ్రంట్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు అని తెలుస్తుంది.
