జులై 7 నుండి Xiaomi రెడ్మి 2 1000 రూ డిస్కౌంట్
దీనికి సంబంధించి టీజర్ ను ఫేస్ బుక్ లో రిలీజ్ చేసింది Xiaomi
ఇప్పటివరకు Xiaomi రెడ్మి 2 మోడల్ 6,999 రూ లకు సేల్ అవుతుంది. అయితే జులై 7 నుండి కంపెని 1000 రూ తగ్గించి, 5,999 రూ లకు మొబైల్ ను అమ్మనుంది.
Surveyఈ విషయాన్ని కంపెని ఫేస్ బుక్ అఫిషియల్ పేజ్ లో వెల్లడించింది. ఇది షార్ట్ టర్మ్ డిస్కౌంట్ లేదా పర్మనంట్ డిస్కౌంటా అనేది ఇంకా తెలియవలసి ఉంది. అలాగే ఇది అఫిషియల్ Xiaomi సైటు లోకి మాత్రమేనా లేక ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ కు కూడానా అనేదాని పై కంపెని స్పష్టం చేయలేదు.
రెడ్మి 2 లో 4.7 in HD IPS LCD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1జిబి ర్యామ్, 8జిబి ఇంబిల్ట్ మెమరి, 2200 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 4.4.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ OS ఉన్నాయి.
తాజాగా కంపెని మి 4 16gb ను 14,999 రూ లకు మరియు 64gb ను 23,999 రూ నుండి 19,999 రూ లకు తగ్గించింది.
The one that switches between BMWs and Harbour Line Second Class. View Full Profile