Redmi Y1 మరియు Y1 లైట్ మొదటి ఫ్లాష్ సేల్ లో అమ్ముడయిన 150,000 యూనిట్లు.

Redmi Y1 మరియు Y1 లైట్ మొదటి ఫ్లాష్  సేల్ లో  అమ్ముడయిన 150,000 యూనిట్లు.

xiaomi యొక్క స్మార్ట్ఫోన్స్ , Redmi Y1 మరియు Y1 లైట్, భారతదేశం లో మొదటి సారి ఫ్లాష్ సేల్ ద్వారా  నిన్న అందుబాటులో వున్నాయి . అమెజాన్ మరియు Me.Com ఆన్లైన్ స్టోర్లలో ఈ ఫోన్ యొక్క సేల్  ప్రారంభమైంది. మొదటి సెల్లో, షియోమి రెడ్మి Y1 మరియు Y1 లైట్ ల యొక్క 150,000 యూనిట్లు సేల్ చేయ బడ్డాయి. షియోమీ  ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ ప్రకారం ఈ స్మార్ట్ఫోన్ల మొట్టమొదటి ఫ్లాష్లో 150,000 యూనిట్లు  సేల్ జరిగిందని తెలిపారు . ఈ సేల్ మొత్తం 3 నిమిషాల్లో జరిగింది.

Xiaomi Redmi Y1లైట్  ధర గురించి మాట్లాడినట్లయితే దాని ధర రూ. 6,999 . Xiaomi రెడ్మి Y1 లైట్ స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425 SOC కలిగి వుంది , ఇది మొదట Xiaomi Redmi 4A లో ఉపయోగించబడింది. 7000 బడ్జెట్  లో పెద్ద స్క్రీన్ తో ఏ ఫోన్  లేదు మరియు Redmi Y1 లైట్ ఈ లోపాన్ని అధిగమించడానికి ప్రవేశపెట్టబడింది, ఫోన్ 5.5 అంగుళాల 720p డిస్ప్లే ను  కలిగి వుంది .  ఈ ఫోన్లో 2GB RAM మరియు 16GB స్టోరేజ్ ఉంది. ఇది 128GB వరకు మైక్రో SD కార్డ్ ద్వారా ఎక్స్ పాండబుల్ . ఈ డివైస్  13MP వెనుక కెమెరా మరియు 3080mAh బ్యాటరీ కలిగి ఉంది.

Xiaomi Redmi Y1 క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 435 SOC కలిగి వుంది , ఇది గతంలో Redmi 4 లో చూసాము .  ఇది 3GB RAM / 32 GB స్టోరేజ్ మరియు 4GB RAM / 64 GB స్టోరేజ్  2 వేరియంట్లలో ఉంటుంది.వీటి  ధర రూ .8,999, రూ .10,999. ఆన్-బోర్డు స్టోరేజ్ తో పాటు, మీరు 128GB స్టోరేజ్  మద్దతు కోసం మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ పొందుతారు.
బ్యాటరీ 3080mAh, ఈ ఫోన్ యొక్క ప్రత్యేక లక్షణం దాని 16MP ముందు కెమెరా, వెనుక కెమెరా PDAF మరియు HDR మద్దతుతో 13MP ఉంది.
ఫోన్లు రెండు ప్లాస్టిక్ బిల్డ్ కలిగి, టాప్ లో  మెటల్ ఫినిషింగ్ తో వున్నాయి . Xiaomi Redmi Y1 మరియు Y1 లైట్ గ్రే  మరియు గోల్డ్ కలర్స్ లో  అందుబాటులో వున్నాయి .

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo