HIGHLIGHTS
12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది
Xiaomi Redmi ప్రో 2 డ్యూయల్ కెమెరా తో ఈ నెల ప్రారంభించనున్నట్లు వార్త
Surveyగత నెల జనవరి లో ఈ డివైస్ యొక్క ఫోటోలు గుప్పుమన్నాయి. అందిన సమాచారం ప్రకారం ఈ డివైస్ ఈ నెల ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డివైస్ లో12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇంతకు ముందు వచ్చిన లీక్ ప్రకారం క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 ప్రాసెసర్ ఉంటుందని చెప్తున్నారు .
లీక్స్ అనుసారం ఈ డివైస్ 2 వేరియంట్స్ లో లభ్యమవుతుంది. మొదటి వేరియంట్ 4 GB రామ్ మరియు 64 GB ఇంటర్నల్ స్టోరేజీ తో ఉంటుంది. రెండవ వేరియంట్ 6GB రామ్ మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజీ తో ఉంటుంది. దీని యొక్క బాడీ పూర్తి మెటల్ యూనిబోడీ డిజైనతో 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే ఉంటుంది. మీడియా టెక్ హీలియో P25 ప్రాసెసర్ ఉనికిలో ఉంటుంది. 12 మెగాపిక్సెల్ కెమెరా తో సోనీ IMX362 సెన్సార్ కలిగి వుంది. 4500mAh బ్యాటరీ. డివైస్ బ్యాక్ ప్యానెల్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile