కేవలం ఒక్కనెలలోనే 10 లక్షల మార్క్ దాటిన రెడ్మి నోట్ 8 సిరీస్ అమ్మకాలు

కేవలం ఒక్కనెలలోనే 10 లక్షల మార్క్ దాటిన రెడ్మి నోట్ 8 సిరీస్ అమ్మకాలు
HIGHLIGHTS

రేపు మధ్యాహ్నం 12 గంటలకి రెడ్మి నోట్ 8 ప్రో సేల్ కూడా జరగనుంది.

ఇండియాలో, బడ్జెట్ మరియు మిడ్ రేంజ్ వినియోగదారులను టార్గెట్ చేసుకొని, 48MP మరియు 64MP క్వాడ్ కెమేరా మరియు మంచి ప్రత్యేకతలతో, రెడ్మి నోట్ 8 సిరీస్ నుండి విడుదల చేసినటువంటి, రెడ్మి నోట్ 8 మరియు రెడ్మి నోట్ 8 ప్రో స్మార్ట్ ఫోన్లు కేవలం ఒక్కనెలలోనే 10 లక్షల మార్క్ దాటినట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్లు చాలా తక్కువ ధరలో ట్రెండీ ఫీచర్లను కలిగివుండంతో, కేవలం కొన్ని ఫ్లాష్ సేల్స్ నుండి 10 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అలాగే, రేపు మధ్యాహ్నం 12 గంటలకి రెడ్మి నోట్ 8 ప్రో సేల్ కూడా జరగనుంది.

వీటిలో ముఖ్యంగా, రెడ్మి నోట్ 8 స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9,999 ధరలో ఒక 48MP క్వాడ్ కెమేరా, FHD డిస్ప్లే మరియు ముందు వెనుకా కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వంటి మంచి ఫీచర్లతో తీసుకురావడంతో, బడ్జెట్ వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్ను కొనడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇక రెడ్మి నోట్ 8 ప్రో విహాసినికి వస్తే, ఈ ఫోన్ను గేమింగ్ ప్రత్యేకమైనటువంటి ఒక మీడియా టెక్ హీలియో G90 ప్రాసెసర్, ఒక ప్రధాన 64MP క్వాడ్ కెమేరా మరియు ఫోన్ను చల్లబరచడానికి ఒక  లిక్విడ్ కూలింగ్ టెక్నాలజితో తీసుకురావడం ఈ ఫోన్ను మిడ్ రేంజ్ వినియోగదారుల ఎంపికగా మార్చింది.

రెడ్మి నోట్ 8 ప్రో ప్రత్యేకతలు

రెడ్మి నోట్ 8 ప్రో ఒక 6.53-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో ఇది 3D కర్వ్డ్ గ్లాస్ తో వస్తుంది.  ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్‌లో మీరు దాని వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని సరికొత్తగా చూడనున్నారు. అదనంగా, ఇందులో గేమింగ్ కోసం మీడియా టెక్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన మీడియాటెక్ G90T గేమింగ్ చిప్‌సెట్‌ తోఈ స్మార్ట్ శక్తినిస్తుంది.మరొక కొత్త విషయం ఏమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ Alexa Built-ఇన్ తో వస్తుంది మరియు ఇండియాలో ఈ ప్రత్యేకతతో వచ్చిన మెట్టమొదటి స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  64 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు  కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 20MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 ప్రోలో,ఒక 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అలాగే, బాక్సుతో పాటుగా ఒక 18W చార్జరును అందించారు.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo