HIGHLIGHTS
కొత్త నోట్ మోడల్ లాంచ్ అవుతుండటం వలన 2000 రూ తగ్గించింది Xiaomi
Xiaomi రెడ్మి నోట్ గత నవంబర్ నెలలో పది వేలకు లాంచ్ అయ్యింది. ఇప్పుడు నోట్ కొత్త మోడల్ లాంచ్ చేసే యోచనలో ఉండటం వలన కంపని ప్రస్తుత నోట్ 4G మోడల్ ను రెండు వేలు తగ్గించిబడింది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, e-bay సైట్ల లో ఇది ఇప్పుడు 7,999 రూ లకు దొరుకుతుంది.
Surveyఈ ఫోన్ లో మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మరియు మంచి కెమేరా ఉంది. ఇప్పుడు తగ్గించిన ధరకి ఇది ప్రైస్ కన్నా ఎక్కువ అవుట్ పుట్ ను ఇస్తునట్లే. దీనిలోని 4G, 4G సేవలను ప్రారంభించిన ఎయిర్టెల్ , రిలయన్స్ స్టాండర్డ్స్ లో పనిచేస్తుంది.
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 400 క్వాడ్ కోర్ 1.6GHz ప్రొసెసర్, 2జిబి ర్యామ్, 8జిబి ఇంబిల్ట్ స్టోరేజ్, 64 అదనపు స్టోరేజ్ సపోర్ట్, 13MP కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా మంచి స్పెసిఫికేషన్స. అయితే రెడ్మి నోట్ 4G డిస్ప్లే మరింత బాగుండాలిసింది. బ్యాటరి లైఫ్ మాత్రం దీని కాంపిటేటర్స్ తోనే కాకుండా లేటెస్ట్ డివైజ్ ల కన్నా మంచి బ్యాక్ అప్ ఇస్తుంది.
రిలీజ్ డేట్ పరంగా ఇది కొంచెం అవుట్ డేటెడ్ అని ఫీల్ అవకుండా ఉంటే ఇది రెగ్యులర్ యూజర్స్ కు తగ్గించిన ధరకు మంచి డివైజ్.
ఆధారం: ట్విట్టర్
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile