Xiaomi రెడ్మి నోట్ 3 ఓపెన్ సేల్స్ ను అనౌన్స్ చేసింది కంపెని

Xiaomi రెడ్మి నోట్ 3 ఓపెన్ సేల్స్ ను అనౌన్స్ చేసింది కంపెని

Xiaomi రెడ్మి నోట్ 3 మరియు Mi5 మోడల్స్ ఏప్రిల్ 27న ఓపెన్ సేల్స్ లో సేల్ అవనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయాన్ని కంపెని ట్విటర్ లో తెలపటం జరిగింది.

 సేల్ కు రిజిస్ట్రేషన్స్ కూడా అవసరంలేదు. అయితే కంపెని ట్విట్ ప్రకారం మొబైల్ Mi.com లో మాత్రమే ఓపెన్ సేల్ జరుపుకోనుంది అని అంచనా.

ఈ ఓపెన్ సేల్ కేవలం ఆ ఒక్క రోజేనా లేదా stock ఉన్నంతవరకూ నెక్స్ట్ days కూడా ఓపెన్ సేల్ ఉంటుందా అనే విషయం స్పష్టం లేదు, కాని కంపెని మాత్రం "on 27th" అంటుంది, "27th onwards" అని తెలపలేదు.

ఓపెన్ సేల్స్ 3GB-32GB వేరియంట్ కూడా సేల్ ఉంటుంది. 2GB ర్యామ్ – 16GB ప్రైస్ – 9,999 రూ. 3GB ర్యామ్ – 32GB స్టోరేజ్ ప్రైస్ 11,999 రూ. రెండు వేరియంట్స్ లోనూ sd కార్డ్ సపోర్ట్ ఉంది కాని హై బ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది ఫోన్..

ఈ కారణంగా ఫోన్ తీసుకోవటానికి కొంతమంది ఆలోచించవచ్చు కాని మొబైల్ మాత్రం మంచి పెర్ఫార్మన్స్, బ్యాటరీ, డిస్ప్లే కలిగి ఉంది. ప్రస్తుత మార్కెట్ లో బడ్జెట్ సెగ్మెంట్ లో రెడ్మి నోట్ 3 విన్నర్..

రెడ్మి నోట్ 3 కంప్లీట్ తెలుగు రివ్యూ కొరకు ఈ లింక్ లో చూడగలరు..
రెడ్మి నోట్ Vs రిమేనింగ్ బడ్జెట్ హ్యాండ్ సెట్స్ – కంపేరిజన్ ఈ లింక్ లో చూడగలరు..
రెడ్మి నోట్ 3 కంప్లీట్ తెలుగు వీడియో రివ్యూ ను ఈ క్రింది వీడియో లో చూడండి…

 

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo