షావోమి No.1 ఫ్యాన్ సేల్ డిసెంబర్ 19 నుండి 21 వరకు : Mi A2, నోట్ 5 ప్రో Mi TV 4C మరియు మరెన్నో ప్రొడక్టుల పైన గొప్ప డిస్కౌంట్లు మరియు ఆఫర్లు

HIGHLIGHTS

షావోమి కూడా Paytm భాగస్వామ్యంతో ఎంపికచేసిన స్మార్ట్ ఫోన్ల పైన రూ.300 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. Google Pay వినియోగదారులు రూ. 500 వరకూ రివార్డ్ పొందేవీలుంది.

షావోమి No.1 ఫ్యాన్ సేల్ డిసెంబర్ 19 నుండి 21 వరకు : Mi A2, నోట్ 5 ప్రో Mi TV 4C మరియు మరెన్నో ప్రొడక్టుల పైన గొప్ప డిస్కౌంట్లు మరియు ఆఫర్లు

గత సంవత్సరం మాదిరిగా,  క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 19 నుండి 21 వరకు Xiaomi చేత నిర్వహించబడే దాని "No.1 Mi Fan Sale"ని  ప్రకటించింది. షావోమి సంస్థ, ఈ సేల్ సమయంలో వినియోగదార్లుకి చాలా ప్రొడక్టులపైన మంచి డిస్కౌంట్లను ఆఫర్ చేసింది, Mi A2, Redmi Y2 మరియు Redmi Note 5 Pro  స్మార్ట్ ఫోన్లు మంచి డిస్కౌంట్ ధర వద్ద అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, రెండురకాల Mi టీవీ మోడల్స్ కూడా ఈ  సేల్ సమయంలో 'మి బాడీ కంపోజిషన్ స్కేల్' తో డిస్కౌంట్ ఇవ్వబడ్డాయి. ఇతర ఆఫర్లలో, ఎంపికచేసిన ఫోన్ల పైన రూ. 300 వరకు క్యాష్ బ్యాక్ వంటి డిస్కౌంట్లు ఉన్నాయి. గూగుల్ పే ఉపయోగించి చెల్లించేవారికి రూ. 500 వరకు రివార్డులు లభిస్తాయి మరియు  MobiKwik ఉపయోగించి కొనుగోలుచేసేవారికి  0 శాతం (1,000 రూపాయల వరకు) సూపర్ క్యాష్ కూడా అందుబాటులో ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

No.1 Mi Fan Sale డీల్స్

సేల్ సమయంలో కొన్ని ముఖ్యమైన ఒప్పందాలలో షావోమి మి A2 మరియు Redmi Y2 స్మార్ట్ ఫోన్ల పైన 1,000 రూపాయలు డిస్కౌంట్ వంటివి ఉన్నాయి. మి  A2, ధర రూ .15,999 గా ఉండగా 1,000 రూపాయల డిస్కౌంట్ తరువాత, ధర రూ .15,999 గా ఉంటుంది మరియు రెడ్మి Y 2 ధర రూ .8,999 గా విక్రయించబడుతుంది. కంపెనీ వెబ్ సైట్ ప్రకారం, 300 రూపాయల Paytm క్యాష్ బ్యాక్ ఈ రెండు ఫోన్లపైన అందుబాటులో ఉంటుంది. రెడ్మి నోట్ 5 ప్రో కూడా ఈ సేల్ ద్వారా 1,000 రూపాయల డిస్కౌంట్ పొంది, రూ. 12,999 ధరతో ఉంటుంది. పోకో F1, రెడ్మి 6A, రెడ్మి 6 మరియు రెడ్మి 6 ప్రో స్మార్ట్ ఫోన్లపైన ఎటువంటి డిస్కౌంట్  ఉండకపోయినా, ఈ హ్యాండ్ సెట్ల పైన రూ. 300 క్యాష్ బ్యాక్ పొందగలుగుతారు.

మరికొన్నిఇతర షావోమి పరికరాలకు వచ్చేసరికి, Mi TV 4A Pro 49 ఒక రాయితీ ధర రూ .30,999 వద్ద అందుబాటులో ఉంటుంది. Mi TV 4A 43 పైన రూ .1,000 తగ్గించి, రూ. 21,999 ధరతో ఉంటుంది. మి టీవీ 4 సి ప్రో 32, రూ .14,999 ప్రైస్ తో ఉంటుంది. యుఎస్ డాలరుకు వ్యతిరేకంగా భారత రూపాయి విలువ తగ్గుముఖం పట్టిన కారణంగా, షావోమి గతంలో దాని ఇతర పరికరాలతో పాటు మి టీవీ 4C మరియు మి టీవీ 4A పైన ధర పెంపును ప్రకటించింది. మి బాడీ కంపోజిషన్ స్కేల్  రూ. 1,799 ధరతో మొదలవుతుంది. ఇది వాస్తవానికి భారతదేశంలో రూ .999 వద్ద ప్రారంభించబడింది.

షావోమి సేల్ సమయంలో,  సంస్థ 4PM వద్ద క్రిస్మస్ ప్రత్యేక మి బహుమతి కార్డులు మరియు కూపన్లు అందిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లకు అర్హులైన ఫోన్లు మరియు ఒక కాంటెస్ట్ అందుబాటులో ఉంటాయి, ఇక్కడ వినియోగదారులు రెడ్మి 6A ను రూ .1 లేదా రూ.1000 వరకు కూపన్లు పొందవచ్చు.  రూ. 549 నుంచి ప్రారంభమయ్యే మి ప్రొటెక్ట్ సర్వీసును కూడా అఫర్ చేస్తోంది మరియు Xiaomi ఫోన్ల కోసం కేసులు మరియు కవర్లు రూ.79 ధర నుండి ప్రారంభమవుతాయి.        

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo