ఇండియాకి షియోమి 120X జూమ్ ఫోన్!! మి11 అల్ట్రా ఫీచర్లు ఒక రేంజ్ లో ఉంటాయి

ఇండియాకి షియోమి 120X జూమ్ ఫోన్!! మి11 అల్ట్రా ఫీచర్లు ఒక రేంజ్ లో ఉంటాయి
HIGHLIGHTS

120X జూమ్ కెమెరా

QHD+ కర్వ్డ్ డిస్ప్లే

హర్మన్ కార్డన్ స్పీకర్లు

ఇటీవల, Xiaomi ప్రపంచవ్యాప్తంగా Mi11 సిరీస్ ను విడుదల చేసింది. ఇప్పుడు, ఈ సిరీస్ లో టాప్ ఎండ్ వేరియంట్ అయిన Mi 11 Ultra  స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేయ్యడానికి సిద్దమయ్యింది. ఈ ఫోన్, భారీ ఫీచర్లతో వుంటుంది. 120X జూమ్ కెమెరా, QHD+ కర్వ్డ్ డిస్ప్లే, హర్మన్ కార్డన్ స్పీకర్లు మరియు ఇంకా చాలా భారీ ఫీచర్లతో ఉంటుంది. మి 11 అల్ట్రా ని ఇండియాలో ఏప్రిల్ 23 న లాంచ్ చేయనున్నట్లు షియోమి ప్రకటించింది.

Mi11 Ultra: ప్రత్యేకతలు (Global Varient)

మి11 అల్ట్రా పెద్ద 6.81-అంగుళాల AMOLED డిస్‌ప్లే ను కలిగి ఉంది. ఇది QHD + (3200×1440 పిక్సెల్స్) రిజల్యూషన్‌ అందిస్తుంది మరియు పంచ్-హోల్ నాచ్ కటౌట్‌ను సెల్ఫీ కెమెరా కోసం కలిగి ఉంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ వరకు మద్దతు ఇస్తుండడమే కాకుండా  Dolby Vision తో పాటుగా HDR10 + ప్లేబ్యాక్ కోసం కూడా ధృవీకరించబడింది. ఈ స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ పొరతో పటిష్టంగా ఉంది.

అధనంగా, వెనుకవైపున కూడా ఒక చిన్న స్క్రీన్ వుంది. ఈ సెకండరీ  స్క్రీన్ 1.1-అంగుళాల మినీ AMOLED డిస్ప్లే . ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి మద్దతు ఇస్తుంది మరియు నోటిఫికేషన్స్ మరియు మరిన్ని వివరాలను చూపిస్తుంది. దీనిని సిరామిక్ వైట్ మరియు బ్లాక్ రంగులలో అందిస్తున్నారు. ఈ ఫోన్ 8.38 మిల్లీమీటర్ల మందం మరియు 234 గ్రాముల బరువు ఉంటుంది. ఇది IP68 రేటింగ్ తో వస్తుంది మరియు 1.5 మీటర్ల వరకు 30 నిమిషాల పాటు దుమ్ము మరియు నీటి ప్రవేశానికి నిరోధకతను కలిగిస్తుంది.

మి 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ ‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ ఆక్టా-కోర్ సిపియు మరియు అడ్రినో 60 GPU తో పనిచేస్తుంది. ఇది 12GB RAM మరియు 256GB స్టోరేజ్ తో జత చేయబడింది. ఈ ఫోన్ అవుట్-ఆఫ్-బాక్స్‌ MIUI 12 లో నడుస్తుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ F / 2.0 ఎపర్చరు మరియు OIS మద్దతుతో 50MP ప్రాధమిక కెమెరా, 5x ఆప్టికల్ జూమ్, 120X వరకు డిజిటల్ జూమ్ అందించగల 48MP పెరిస్కోప్ కెమెరా మరియు 128-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. . వెనుక కెమెరాలు 24 fps వద్ద 8K మరియు 60 fps వరకు 4K  UHD లో రికార్డ్ చేయగలవు. ముందు వైపు, నాచ్ కటౌట్ లోపల 20MP సెల్ఫీ కెమెరా ఉంది.

మి 11 అల్ట్రాలో Harman Kardon ఆప్టిమైజ్ చేసిన స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 67W ఫాస్ట్ వైర్డ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీనితో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 36 నిమిషాలు మాత్రమే పడుతుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo