48MP బడ్జెట్ ఫోన్ Mi A3 యొక్క మరొక ఫ్లాష్ సేల్ : రాత్రి 8 గంటలకి.

Updated on 23-Aug-2019
HIGHLIGHTS

ఇది ఒక 7 వ తరం ఇన్ - డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.

షావోమి తన మూడవ ఆండ్రాయిడ్ వన్ ఫోన్ Mi A3 అద్భుతమైన ప్రత్యేకతలతో, ఇండియాలో విడుదల చేసింది మరియు దీన్ని కేవలం రూ. 12,999 రూపాయల ప్రారంభం ధరతో ప్రకటించి. ఇప్పుడు, ప్రస్తుతం మార్కెట్లో అతితక్కువ ధరలో అందుబాటులోవున్న 48MP ట్రిపుల్ కెమేరా, అదీకూడా Android One స్మార్ట్ ఫోన్ కేవలం Mi A3 మాత్రమే అవుతుంది. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి, అమేజాన్, mi.com మరియు Mi స్టోర్లలో జరగనుంది. అయితే, ఈ రోజు రాత్రి 8 గంటలకి ఈ ఫోన్ యొక్క ఫ్లాష్ సేల్ జరగనుంది.       

Mi A3 ధరలు

షావోమి మి ఎ 3 ని రెండు వేరియంట్లలో ప్రకటించింది. ఒకటి 4 జీబీ ర్యామ్‌ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో, మరొకటి 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ యొక్క 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ .12,999 కాగా, 6 జీబీ ర్యామ్ వెర్షన్ ధర రూ .15,999 గా ప్రకటించింది.

షావోమి Mi A 3 ఫీచర్లు

షావోమి మి A3 లో ఒక 6.08-అంగుళాల HD + AMOLED డిస్ప్లేతో వస్తుంది మరియు ఇది ఒక 7 వ తరం ఇన్ – డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది 720×1560 p రిజల్యూషన్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక వాటర్‌డ్రాప్-నోచ్ డిజైన్‌తో 19.5: 9 యాస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత శక్తిని కలిగి ఉంది, ఇది 4GB / 6GB RAM శక్తితో మరియు 64GB / 128GB వంటి ఇంటర్నల్ స్టోరేజి ఎంపికలతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్,  3.5 హెడ్‌ఫోన్ జాక్‌ కలిగి ఉంటుంది మరియు ఆండ్రాయిడ్ 9 పై పనిచేస్తుంది.

ఇక కెమెరా విషయానికొస్తే, ఈ ఫోన్  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఉంది, దీనిలో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 48 MP ప్రాధమిక సెన్సార్ ఉంటుంది. అలాగే, 118-డిగ్రీల వైడ్ యాంగిల్ f / 1.79 లెన్స్‌తో 8MP సెకండరీ సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ముందు భాగంలో 32 MP కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చరు లెన్స్‌తో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 4030mAh బ్యాటరీ మద్దతు ఉంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.మరియు టైప్-సి యుఎస్‌బి పోర్ట్‌తో వస్తుంది.                          

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :