Xiaomi Mi 9 స్మార్ట్ ఫోన్ యొక్క అన్ని స్పెక్స్ ఆన్లైన్లో లీకయ్యాయి.
షావోమి మి 9 స్పెక్స్ లీక్ : 48 MP సెన్సారుతో, ఒక ట్రిపుల్ రియార్ కెమేరా, 32 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది
ముఖ్యాంశాలు:
Survey1. Xiaomi Mi 9 స్మార్ట్ ఫోన్ యొక్క అన్ని స్పెక్స్ ఆన్లైన్లో లీకయ్యాయి.
2. ఈ స్మార్ట్ ఫోన్ ఒక స్నాప్డ్రాగెన్ 855 SoC తో నడవనున్నట్లు చెప్పబడింది.
3. ఇది 48 MP కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్పుతో వస్తుంది.
Xiaomi ఇప్పటికే ఈ సంవత్సరం దాని మి మిక్స్ 3 స్మార్ట్ ఫోన్ను, ఒక 5G వేరియంట్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే, అది Mi 9 మరియు మి మిక్స్ 4 ఫోన్ల కోసం కూడా పనిచేస్తునట్లు తెలుస్తోంది. ఇది స్నాప్ డ్రాగన్ 855 తో, 5G మద్దతుతో వస్తుందని చెప్పవచ్చు. షావోమి మి 9 పైన ఆన్లైన్ ఒక కొత్త నివేదిక మరియు ఒక Weibo పోస్ట్ వివరాలు, ఈ హ్యాండ్ సెట్ యొక్క దాదాపుగా అన్ని వివరాలను కలిగివుంది. ఈ నివేదిక నిజంగా నమ్మదగినదైతే, Mi 9 కోసం సోనీ యొక్క IMX586 సెన్సారును ఉపయోగించనున్నట్లు చెబుతున్నారు. ఇది ఒక 48MP ప్రధాన కెమెరాతో, ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా ఒక 12MP ద్వితీయ కెమెరా మరియు ఒక 3D TOF కెమెరాతో రానున్నట్లు అంచనావేయొచ్చు. గత నివేదిక, ఈ షావోమి మి 9 వెనుక మూడు కెమెరాలు కలిగి, ఈ కంపెనీ నుండి రానున్నమొదటి స్మార్ట్ ఫోనుగా ఉంటుందిని సూచించారు.
అంతేకాక, మి 9 ను ఒక 6.4-అంగుళాల 19: 9 1080p AMOLED డిస్ప్లేతో పైన వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ రెండర్ కూడా అదే ప్రదర్శన పరిమాణాన్ని సూచించింది, కాని వాటర్ డ్రాప్ నోచ్ మాత్రం కాదు. Mi 9 లో దాని డిస్ప్లేలో వేలిముద్ర సెన్సార్ను కలిగివుండవచ్చని ఊహించబడింది మరియు ఇది ముందుగావచ్చిన, OnePlus 6T లాగా కావచ్చని చెప్పబడింది, అయితే వెనుకవైపున ట్రిపుల్ కెమెరా సెటప్, నిలువుగా ఉండేటట్లు అమర్చవచ్చు, ఇది హువాయ్ P20 ప్రోలో వలెనే కనిపిస్తుంది. పైన పేర్కొన్న విధంగా, ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 855 SoC తో X24 LTE మోడెమ్ తో అమలు చేయబడుతుందని మరియు 6GB RAM + 128GB కాన్ఫిగరేషన్లో అందించబడుతుందని భావిస్తున్నారు. ఇది CNY 2,999 (ధర రూ. 30,466) వద్ద ప్రారంభమవుతుంది.
ఈ మి 9 9 MIUI 10 పై నడపబడుతున్నట్లు చెప్పబడింది, ఇది Android Pie పైన ఆధారపడి ఉంటుంది. ఫోన్ ఒక 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాకేజీగా వస్తుందని కూడా చెప్పబడింది, అయితే, వైర్లెస్ ఛార్జింగ్ మద్దతు గురించి ప్రస్తావించలేదు. ఈ హ్యాండ్సెట్ 155 x 75 x 7.6 mm కొలతలు కలిగి ఉండవచ్చు మరియు మార్చిలో అందుబాటులో ఉండవచ్చు. మార్చి నెలలో ఈ ఫోన్నీ ప్రారంభించాలని కంపెనీ ఆలోచిస్తుంటే గనుక, మేనము రాబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2019 (MWC 2019) సమయంలో దాని గురించి ప్రకటించే అవకాశం ఉండవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile